జగన్‌పై ఏపీ పోలీసాఫీసర్ల ఆగ్రహం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై ఆరోపణలు చేసేటప్పుడు జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య విషయంలో డీజీపీ, పోలీసు అధికారులపై జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. హత్యా రాజకీయాల్లోకి తమ శాఖకు చెందిన వారిని లాగవద్దని కోరింది. తాము నిష్పక్షపాతంగా విధులు […]
BY Pragnadhar Reddy6 May 2015 10:38 AM GMT

X
Pragnadhar Reddy6 May 2015 10:38 AM GMT
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై ఆరోపణలు చేసేటప్పుడు జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య విషయంలో డీజీపీ, పోలీసు అధికారులపై జగన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. హత్యా రాజకీయాల్లోకి తమ శాఖకు చెందిన వారిని లాగవద్దని కోరింది. తాము నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నామని, తమను రాజకీయాల్లోకి లాగవద్దని పోలీసు అధికారుల సంఘం జగన్‌కు విజ్ఞప్తి చేసింది. పోలీస్ అధికారుల సంఘానికి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. పది రోజుల్లోగా పోలీసాఫీసర్లపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Next Story