సీసీఐలో భారీ కుంభకోణం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో భారీ కుంభకోణం జరిగింది. దాదాపు 400 కోట్ల రూపాయల విలువజేసే పత్తి కొనుగోళ్ళ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని తెలిసింది. ఇందులో అధికారుల హస్తముందా? రాజకీయ నాయకుల హస్తముందా అనే విషయం ఇంకా వెలుగు చూడలేదు. ఈ అంశంపై దర్యాప్తు జరపడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. సీసీఐలో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న ఫైళ్ళు, ముఖ్య సమాచారం లభిస్తుందని భావిస్తున్న కొన్ని […]
BY Pragnadhar Reddy6 May 2015 4:22 AM GMT

X
Pragnadhar Reddy6 May 2015 4:22 AM GMT
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో భారీ కుంభకోణం జరిగింది. దాదాపు 400 కోట్ల రూపాయల విలువజేసే పత్తి కొనుగోళ్ళ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని తెలిసింది. ఇందులో అధికారుల హస్తముందా? రాజకీయ నాయకుల హస్తముందా అనే విషయం ఇంకా వెలుగు చూడలేదు. ఈ అంశంపై దర్యాప్తు జరపడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. సీసీఐలో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న ఫైళ్ళు, ముఖ్య సమాచారం లభిస్తుందని భావిస్తున్న కొన్ని పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అసలు ఇంత పెద్ద కుంభకోణానికి తెర ఎక్కడ లేచిందో… మూలాలెక్కడ ఉన్నాయో తెలుసుకునే పనిలో సీబీఐ ఉంది.
Next Story