స్వీయ గృహ నిర్బంధం.. ఆమరణ దీక్ష
హైదరాబాద్ : విద్యుత్ శాఖలో థర్డ్ పార్టీ ఒప్పంద (కాంట్రాక్ట్) వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ నేత ఎస్. సాయిలు హైదరాబాద్‌లోని నాగోలు వద్ద చాణిక్యపురి కాలనీలోని తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీనిపై వారం రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో శనివారం సాయిలు మింట్ కాంపౌండ్‌లోని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ చాంబర్ వద్ద […]
BY Pragnadhar Reddy4 May 2015 1:11 PM GMT
Pragnadhar Reddy4 May 2015 1:11 PM GMT
హైదరాబాద్ : విద్యుత్ శాఖలో థర్డ్ పార్టీ ఒప్పంద (కాంట్రాక్ట్) వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ నేత ఎస్. సాయిలు హైదరాబాద్‌లోని నాగోలు వద్ద చాణిక్యపురి కాలనీలోని తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీనిపై వారం రోజులుగా కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో శనివారం సాయిలు మింట్ కాంపౌండ్‌లోని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ చాంబర్ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. దీంతో పోలీసులు సాయిలును అరెస్టు చేసి ఇంటివద్ద వదిలి వెళ్లారు. అయినా పట్టు వదలని సాయిలు తమ డిమాండ్‌ను నెరవేర్చాలంటూ.. ఇంట్లో గడియ పెట్టుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. థర్డ్ పార్టీ కాంట్రాక్టు వ్యవస్థ వల్ల కార్మికులంతా ఎంతో నష్టపోతున్నారని, తమ డిమాండ్లు నెరవేరేదాకా ప్రాణం పోయినా దీక్ష విరమించబోనని సాయిలు స్పష్టం చేశారు. సాయిలుకు మద్దతుగా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయన ఇంటి వద్దే నిరసన చేపట్టి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
Next Story