ఛార్జీల వడ్డనకు ఆర్టీసీ సిద్ధం
ప్రయాణీకులపై ఛార్జీల భారం మోపడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధమవుతోంది. నష్టాల్లో కూరుకుపోయి ఆర్థికంగా సతమతమవుతున్న సంస్థను కాపాడాలంటే ఛార్జీల పెంపు ఒక్కటే మార్గమని యాజమాన్యం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సమయం చూసి ఛార్జీలను పెంచాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. ఈసారి 10 నుంచి 15 శాతం వరకు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదిస్తోంది. డీజిల్ రేట్లు పెరగడం, బాకీలు పేరుకుపోవడం, జీతాలు అధిక మొత్తంలో చెల్లించాల్సి రావడంతో […]
BY Pragnadhar Reddy4 May 2015 4:01 PM GMT
Pragnadhar Reddy4 May 2015 4:01 PM GMT
ప్రయాణీకులపై ఛార్జీల భారం మోపడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధమవుతోంది. నష్టాల్లో కూరుకుపోయి ఆర్థికంగా సతమతమవుతున్న సంస్థను కాపాడాలంటే ఛార్జీల పెంపు ఒక్కటే మార్గమని యాజమాన్యం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సమయం చూసి ఛార్జీలను పెంచాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. ఈసారి 10 నుంచి 15 శాతం వరకు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదిస్తోంది. డీజిల్ రేట్లు పెరగడం, బాకీలు పేరుకుపోవడం, జీతాలు అధిక మొత్తంలో చెల్లించాల్సి రావడంతో సంస్థపై భారం ఎక్కువ పడుతోంది. దీన్ని తగ్గించుకోవడానికి అన్వేషిస్తున్న మార్గాల్లో భాగంగా ఛార్జీల పెంపుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇపుడు ఆర్టీసీ సిబ్బంది కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులతో సమానంగా జీతాలు కావాలని, 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపుతోనే ఈ భారాన్ని తగ్గించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ఆర్టీసీ చివరిసారిగా 2013 నవంబర్‌లో ఛార్జీలను పెంచింది. ఇపుడు మళ్ళీ ఆ బాటలో పయనిస్తోంది. ప్రభుత్వం అనుమతిస్తే ఛార్జీలు పెంచుతామని ఆర్టీసీ ఎండీ స్వయంగా ప్రకటించారు.
Next Story