Telugu Global
Others

నేటి అర్ధరాత్రి నుంచే రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ బస్సులు బంద్‌

హైదరాబాద్ : ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఫిట్‌మెంట్‌, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), టీఎంయూ కూటమికి నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) కూడా మద్దతు ప్రకటించింది. ఈ సమస్యలను ఇప్పటికే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కార్మిక సంఘాలు… స్పష్టమైన నిర్ణయం రాకపోతే మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బస్‌భవన్‌లో మ‌ళ్ళీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సమావేశమవుతోంది. రాత్రి […]

హైదరాబాద్ : ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఫిట్‌మెంట్‌, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), టీఎంయూ కూటమికి నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) కూడా మద్దతు ప్రకటించింది. ఈ సమస్యలను ఇప్పటికే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కార్మిక సంఘాలు… స్పష్టమైన నిర్ణయం రాకపోతే మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బస్‌భవన్‌లో మ‌ళ్ళీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సమావేశమవుతోంది. రాత్రి 12 గంటల వరకూ వేచి చూస్తామని, ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించకపోతే బుధవారం తొలి సర్వీసు నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బస్సులు ఆపేస్తామని ఈయూ రాష్ట్ర నాయకుడు వలిశెట్టి దామోదర్‌రావు స్పష్టం చేశారు. మరోవైపు, ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు పలకాలని ఎన్‌ఎంయూ నిర్ణయించింది. సోమవారం విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏపీలోని 13 జిల్లాల రీజినల్‌, జోనల్‌ కమిటీ, రాష్ట్ర కమిటీ నేతల సమావేశమయ్యారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ సమ్మెకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు ప్రకటించారు. 6వ తేదీ తెల్లవారుజాము నుంచి ఈయూతోపాటు సమ్మెలో పాల్గొనాలని ఆయా జిల్లాల శ్రేణులకు పిలుపునిచ్చారు.
Next Story