ఏపీలో ఇక భూమి అడగరు.. లాక్కోవడమే!
చంద్రబాబు ప్రభుత్వం రైతుల పొట్టకొట్టేందుకు మరో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు పావులు కదుపుతోంది. ఇంతకాలం నయానో, భయానో.? బలవంతంగా భూములు సమీకరిస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇక భూసేకరణ ఆయుధాన్ని బయటకు తీయనుంది. అంటే ఇకపై రైతులను ఒప్పించి వారి అభీష్టం మేరకు భూములు తీసుకోవడం ఉండదు. తనకు నచ్చిన ప్రాంతంలో భూమిని లాక్కుంటుందన్నమాట. ఇప్పటివరకూ రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలను భూ సేకరణ ద్వారా అధికారులు సేకరించామని అంటున్నారు. అయితే, నిజానికి 7 లేదా 8 వేల […]

చంద్రబాబు ప్రభుత్వం రైతుల పొట్టకొట్టేందుకు మరో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు పావులు కదుపుతోంది. ఇంతకాలం నయానో, భయానో.? బలవంతంగా భూములు సమీకరిస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇక భూసేకరణ ఆయుధాన్ని బయటకు తీయనుంది. అంటే ఇకపై రైతులను ఒప్పించి వారి అభీష్టం మేరకు భూములు తీసుకోవడం ఉండదు. తనకు నచ్చిన ప్రాంతంలో భూమిని లాక్కుంటుందన్నమాట. ఇప్పటివరకూ రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలను భూ సేకరణ ద్వారా అధికారులు సేకరించామని అంటున్నారు. అయితే, నిజానికి 7 లేదా 8 వేల ఎకరాలకు మించి రైతులివ్వలేదు. ఇచ్చిన వాళ్ళలో చాలా మంది మళ్ళీ కోర్టుకెళ్ళి తమ భూములను తిరిగి స్వాధీన పరుచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి పరిస్థితి అర్ధమయింది. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చే పరిస్థితి లేదని తెలుసుకున్నారు. దాంతో ఇక నుంచి భూమిని భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 14లోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే భూసేకరణకు దేశవ్యాప్తంగా ఎదురవుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వము, కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి…