శ్మశానంలో యువతి అస్థికలను ఎత్తుకెళ్లిన ప్రేమికుడు
ప్రేమించిన చెలిపై తమకున్న ప్రేమను భగ్న ప్రేమికులు కవితలు, పాటల రూపంలో వ్యక్తపరుస్తుంటారు. కానీ హైదరాబాద్‌లో ప్రేమలో విఫలమైన ఓ ప్రియుడు తను ఇష్టపడ్డ అమ్మాయి మరణానంతరం ఆమె అస్థికలను ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఓ యువతి ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంది. ఈనెల 2న యువతికి దహనసంస్కారాలు కూడా నిర్వహించారు. యువతిని ప్రేమించిన యువకుడు సాయిరామకృష్ణ ఆదివారం రాత్రి శ్మశానానికి వెళ్లి కాటి కాపరితో చనిపోయినది తన భార్య అని చెప్పి అక్కడే కొద్దిసేపు […]
BY Pragnadhar Reddy4 May 2015 1:16 PM GMT
Pragnadhar Reddy4 May 2015 1:16 PM GMT
ప్రేమించిన చెలిపై తమకున్న ప్రేమను భగ్న ప్రేమికులు కవితలు, పాటల రూపంలో వ్యక్తపరుస్తుంటారు. కానీ హైదరాబాద్‌లో ప్రేమలో విఫలమైన ఓ ప్రియుడు తను ఇష్టపడ్డ అమ్మాయి మరణానంతరం ఆమె అస్థికలను ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఓ యువతి ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంది. ఈనెల 2న యువతికి దహనసంస్కారాలు కూడా నిర్వహించారు. యువతిని ప్రేమించిన యువకుడు సాయిరామకృష్ణ ఆదివారం రాత్రి శ్మశానానికి వెళ్లి కాటి కాపరితో చనిపోయినది తన భార్య అని చెప్పి అక్కడే కొద్దిసేపు రోదించాడు. కాటికాపరిని బెదిరించి అస్థికలు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story