గృహ నిర్మాణ అక్రమాలపై విచారణ: మంత్రి మృణాళిని
గృహ నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని తెలిపారు. ఈ యేడాది కొత్తగా రెండు లక్షల గృహాలకు ప్రతిపాదనలు పంపామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన 14 లక్షల ఇళ్ళకు బిల్లులు కూడా లేవని ఆమె చెప్పారు. జియో ట్యాగింగ్ లేకుండా రూ. 4,800 కోట్లు ఖర్చు చేశారని, ఈ నిధులన్నీ ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళాయో తేలాల్సి ఉందని ఆమె అన్నారు.
BY Pragnadhar Reddy4 May 2015 7:36 PM IST
Pragnadhar Reddy Updated On: 5 May 2015 10:25 AM IST

Next Story