హైకోర్టు విభజనపై పార్లమెంటులో రభస
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంశం మంగళవారం పార్లమెంటును కుదిపేసింది. తెలంగాణ ఎంపీలతోపాటు కర్ణాటక ఎంపీలు కూడా ఈ అంశంపై స్పందించారు. జీరో అవర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఏపీ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండు చేశారు. దీనివల్ల తెలంగాణ న్యాయమూర్తులకు, న్యాయవాదులకు న్యాయం జరుగుతుందని, ఇప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ న్యాయమూర్తులున్నారని, దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. దీనికి మరో ఎంపీ మల్లిఖార్జన ఖర్గే మద్దతు […]
BY Pragnadhar Reddy5 May 2015 7:48 AM IST
X
Pragnadhar Reddy Updated On: 5 May 2015 7:48 AM IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంశం మంగళవారం పార్లమెంటును కుదిపేసింది. తెలంగాణ ఎంపీలతోపాటు కర్ణాటక ఎంపీలు కూడా ఈ అంశంపై స్పందించారు. జీరో అవర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఏపీ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండు చేశారు. దీనివల్ల తెలంగాణ న్యాయమూర్తులకు, న్యాయవాదులకు న్యాయం జరుగుతుందని, ఇప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ న్యాయమూర్తులున్నారని, దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. దీనికి మరో ఎంపీ మల్లిఖార్జన ఖర్గే మద్దతు తెలిపారు. రాష్ట్రాన్ని ఇప్పటికే విభజించినందున హైకోర్టును ఉమ్మడిగా ఉంచాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. చట్టంలోని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉందని మరో ఎంపీ వినోద్ కోరారు. విభజన చట్టం పార్లమెంటులోనే ఆమోదం పొందినందున హైకోర్టును కూడా తక్షణమే విభజిస్తూ ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోయామని కేంద్ర మంత్రి సదానందగౌడ తెలిపారు. ఇపుడు తీర్పు వెలువడినందున దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా ఇదే అంశంపై పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన ధర్నా చేశారు. హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండు చేశారు. మా రాష్ట్రం… మా కోర్టు… అంటూ నినాదాలు చేశారు. ఈ విషయమై ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైకోర్టు ఉమ్మడిగా ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
Next Story