హైదరాబాద్‌లో అగ్రిగోల్డ్ ఆందోళన ఉద్రిక్తం
కష్టపడి సంపాదించిన సొమ్మును గద్దల్లా తన్నుకుపోయిన అగ్రిగోల్డ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని వేలాదిమంది బాధితులు హైదరాబాద్ రోడ్లపై ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళన ఉధృతమవడంతో అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద ఉద్రికత్త ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న మహిళా ఏజంట్లను, బాధితులను పోలీసులు భారీగా అరెస్ట్ చేశారు. గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది బాధితులు నిన్న విజయవాడలో ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు. మంగళవారం […]
BY Pragnadhar Reddy5 May 2015 8:43 AM IST
X
Pragnadhar Reddy Updated On: 5 May 2015 8:43 AM IST
కష్టపడి సంపాదించిన సొమ్మును గద్దల్లా తన్నుకుపోయిన అగ్రిగోల్డ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని వేలాదిమంది బాధితులు హైదరాబాద్ రోడ్లపై ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళన ఉధృతమవడంతో అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద ఉద్రికత్త ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న మహిళా ఏజంట్లను, బాధితులను పోలీసులు భారీగా అరెస్ట్ చేశారు. గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది బాధితులు నిన్న విజయవాడలో ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు. మంగళవారం మళ్ళీ హైదరాబాద్ రోడ్డెక్కారు. బాధితులకు సమాధానం చెప్పలేని ఏజంట్లు చావాలో బతకాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ ఇళ్లపై దాడులు చేస్తున్నారని, మెడలో పుస్తెలు కూడా లాక్కున్నారని, చావు బతుకులతో తమకు సంబంధం లేదని, తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాధితులు తమపై దాడులు చేస్తున్నారని ఏజంట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులకు హస్తముందని, వారు ముడుపులు తీసుకుని జనాన్ని అవస్థలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ అవినీతిపై సీఐడీ దర్యాప్తు జరుగుతుందని చాలాకాలం నమ్మించారని, కొంతమంది ప్రభుత్వ పెద్దలు సదరు సంస్థ నుంచి రూ. 20 కోట్లు ముడుపులు తీసుకుని కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు బాధితులు, ఏజంట్లు 45 మంది చనిపోయారని, ఇప్పటికైనా బాధితుల్ని ఆదుకోకపోతే తమకు కూడా చావే శరణ్యమవుతుందని వారు చెప్పారు.
అగ్రిగోల్డ్ ప్రచారానికి, పటాటోపానికి భ్రమపడి లక్షలాది రూపాయలను డిపాజిట్లుగా పెట్టారని, బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకుని బాధితులకు సరైన సమాధానం ఇవ్వడం లేదని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. అసలు వేలాది కోట్ల డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ, ఆ సొమ్మును ఎక్కడ, ఎవరి పేరుతో దాచి పెట్టారో బయటికి తీసి బాధితులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని ఆయన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వెంటనే అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను జప్తు చేయాలని డిమాండు చేశారు. తమ పార్టీ సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
Next Story