Telugu Global
Others

ఏపీలో 4600 చెరువుల అభివృద్ధి 

నెల్లూరు  : తెలంగాణ‌లో మిష‌న్ కాక‌తీయ ఆంధ్ర‌కు కూడా స్ఫూర్తినిస్తుంది. ఏపీలో 4600 చెరువులను అభివృద్ధి పరిచేదిశగా 300 మంది ఇంజనీర్లు కంకణబద్ధులై ఉన్నారని నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు చెప్ప‌డం దీనికి ఊతం ఇస్తోంది. చెరువులు నిండితే మూడేళ్ళు పంట‌ల‌కు డోకా ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఏడాదిలోగా గోదావరి నీటిని కృష్ణాలో కలిపేస్తామంటూ ఆయ‌న తెలిపారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చినక్రాకలో ఆయన రూ.25 కోట్లతో కావలి కాలువ వెడల్పు పనులకు మరో […]

నెల్లూరు : తెలంగాణ‌లో మిష‌న్ కాక‌తీయ ఆంధ్ర‌కు కూడా స్ఫూర్తినిస్తుంది. ఏపీలో 4600 చెరువులను అభివృద్ధి పరిచేదిశగా 300 మంది ఇంజనీర్లు కంకణబద్ధులై ఉన్నారని నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు చెప్ప‌డం దీనికి ఊతం ఇస్తోంది. చెరువులు నిండితే మూడేళ్ళు పంట‌ల‌కు డోకా ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఏడాదిలోగా గోదావరి నీటిని కృష్ణాలో కలిపేస్తామంటూ ఆయ‌న తెలిపారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చినక్రాకలో ఆయన రూ.25 కోట్లతో కావలి కాలువ వెడల్పు పనులకు మరో మంత్రి నారాయణతో కలసి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యులు బొల్లినేని పది నెలలపాటు వెంటపడి నిధులు మంజూరు చేయించుకున్నార‌న్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలను ఇరిగేషన్‌ పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కావలి కాలువ రైతుల కష్టాలు తీర్చిన ప్రభుత్వాన్ని, మంత్రి ఉమను అభినందించాల్సిందేనన్నారు. రై తు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి రంగానికే పెద్దపీట వేశారని మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
First Published:  4 May 2015 6:36 PM IST
Next Story