Telugu Global
Others

జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ సొసైటీలకు టి సహకార శాఖ నోటీసులు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ సొసైటీలకు తెలంగాణ సహకార శాఖ ఆదివారం నాడు నోటీసులు జారీ చేసింది. పాలకవర్గం సభ్యుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన‌ వారు ఎంత మంది ఉన్నారో చెప్పాలని ఆ శాఖ కమిషనర్‌ కోరారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, భారతీయ విద్యా భవన్‌, ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ పాలకవర్గం సభ్యుల స్థానికతను సహకార శాఖ ప్రశ్నించింది. వారి స్థానికత నిరూపించే ఆధారాల‌తోపాటు చిరునామాలు కూడా ఇవ్వాలని కమిషనర్‌ కోరారు. సొసైటీల్లో అవకతవకలపై విచారణ […]

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ సొసైటీలకు తెలంగాణ సహకార శాఖ ఆదివారం నాడు నోటీసులు జారీ చేసింది. పాలకవర్గం సభ్యుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన‌ వారు ఎంత మంది ఉన్నారో చెప్పాలని ఆ శాఖ కమిషనర్‌ కోరారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, భారతీయ విద్యా భవన్‌, ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ పాలకవర్గం సభ్యుల స్థానికతను సహకార శాఖ ప్రశ్నించింది. వారి స్థానికత నిరూపించే ఆధారాల‌తోపాటు చిరునామాలు కూడా ఇవ్వాలని కమిషనర్‌ కోరారు. సొసైటీల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న సభాసంఘం కోసం ఈ వివరాలు ఇవ్వాలని సహకార శాఖ కమిషనర్‌ తెలిపారు.
Next Story