నల్ల ధనానికి తెల్ల ముసుగు!
న్యూఢిల్లీ : చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయివేటు కంపెనీలు జారీ చేసే నాన్ కన్వర్టబుల్ డిబెంబచర్లు, ప్రైవేట్ ప్లేస్‌మెంట్లలో నల్ల ధన స్వాములు రూ.2 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాయి. రెవెన్యూ శాఖకు చెందిన నిఘా వర్గాలు ఈ విషయాన్ని గుర్తించి సెబితో పాటు ఇతర నియంత్రణ సంస్థలను అప్రమత్తం చేశాయి. సెబీ నిబంధనల ప్రకారం ఏ కంపెనీ కూడా నియంత్రణా సంస్థలకు తెలియకుండా 49 మంది కంటే ఎక్కువ మందికి ప్రైవేట్ […]
BY Pragnadhar Reddy3 May 2015 11:22 PM GMT
Pragnadhar Reddy3 May 2015 11:22 PM GMT
న్యూఢిల్లీ : చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రయివేటు కంపెనీలు జారీ చేసే నాన్ కన్వర్టబుల్ డిబెంబచర్లు, ప్రైవేట్ ప్లేస్‌మెంట్లలో నల్ల ధన స్వాములు రూ.2 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాయి. రెవెన్యూ శాఖకు చెందిన నిఘా వర్గాలు ఈ విషయాన్ని గుర్తించి సెబితో పాటు ఇతర నియంత్రణ సంస్థలను అప్రమత్తం చేశాయి. సెబీ నిబంధనల ప్రకారం ఏ కంపెనీ కూడా నియంత్రణా సంస్థలకు తెలియకుండా 49 మంది కంటే ఎక్కువ మందికి ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా షేర్లు, డిబెంచర్లు జారీ చేయకూడదు. ఆ విషయాన్ని పత్రికల్లో ప్రకటించడంతో పాటు తమ ప్రాంతానికి చెందిన కంపెనీల రిజిస్ర్టార్ ఆఫీసు(ఆర్‌ఒసి)లకు తెలియజేయాలి. కొన్ని అల్లాటప్పా కంపెనీలు కంపెనీలు, ఈ నిబంధనకు తూట్లు పొడుస్తూ నల్ల ధన స్వాముల అక్రమ సంపాదనను చలామణిలోకి తెచ్చేందుకు వేదికలవుతున్నాయి. ఈ కంపెనీలు ప్రైవేట్ ప్లేస్‌మెంట్, ప్రిఫరెన్షియల్ పద్దతుల్లో నాన్ కన్వర్టబుల్ రుణ పత్రాలు నల్ల ధన స్వాములకు జారీ చేస్తున్నాయి. కేంద్ర రెవెన్యూ శాఖకు చెందిన నిఘా వర్గాలు ఇప్పటికే ఇలాంటి 500 కేసులను గుర్తించి సెబితో సహా నియంత్రణ సంస్థలకు తెలిపాయి. ప్రస్తుతం వీటిపై దర్యాప్తు జరుగుతోంది
Next Story