ఔషధ గుణాలు నిండిన నిమ్మ
నిమ్మకాయను చూసినా, దాని గురించి విన్నా పులుపు గుణం గుర్తుకు వచ్చి మన నోటిలో లాలాజలం ఊరిపోతుంది. వేసవిలో దాహార్తిని తీర్చడంతో పాటు కొత్త శక్తిని నింపే నిమ్మరసం చేసే మేలు అంతా ఇంతా కాదు. వెజ్, నాన్‌వెజ్ కూరలు నిమ్మరసంతో కొత్త రుచిని సంతరించుకుంటాయి. అయితే నిమ్మలో ఔషధగుణాలు కూడా మెండుగా ఉన్నాయి. – నిమ్మరసం జీర్ణరసాలు ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తుంది. దానివల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఫలితంగా మనం తినే ఆహారంలోని పోషకాలను […]
BY Pragnadhar Reddy3 May 2015 3:25 PM GMT

X
Pragnadhar Reddy3 May 2015 3:25 PM GMT
నిమ్మకాయను చూసినా, దాని గురించి విన్నా పులుపు గుణం గుర్తుకు వచ్చి మన నోటిలో లాలాజలం ఊరిపోతుంది. వేసవిలో దాహార్తిని తీర్చడంతో పాటు కొత్త శక్తిని నింపే నిమ్మరసం చేసే మేలు అంతా ఇంతా కాదు. వెజ్, నాన్‌వెజ్ కూరలు నిమ్మరసంతో కొత్త రుచిని సంతరించుకుంటాయి. అయితే నిమ్మలో ఔషధగుణాలు కూడా మెండుగా ఉన్నాయి.
– నిమ్మరసం జీర్ణరసాలు ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తుంది. దానివల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఫలితంగా మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం బాగా గ్రహించగలుగుతుంది.
– నిమ్మరసం వల్ల మూత్రంలో సిట్రేట్ మోతాదులు పెరుగుతాయి. ఈ సిట్రేట్ మూత్రంలోని కాల్షియానికి అతుక్కుపోతుంది. దానివల్ల కాల్షియం స్థాయి పెరిగిపోయి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా నివారించబడతాయి.
– మన శరీరానికి ఎంతగానో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లలో విటమిన్ సి కూడా ఒకటి. ఇది నిమ్మలో పుష్కలంగా ఉంటుంది.
– అలర్జీని నివారించే గుణాలు నిమ్మలో ఎక్కువగా ఉన్నాయి.
– నిమ్మ అనగానే విటమిన్ సి ఒక్కటే గుర్తుకొస్తుంది. కానీ నిమ్మలో విటమిన్ ఏ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి.
Next Story