Telugu Global
Others

ఖాట్మండు ఎయిర్‌పోర్టు దాటని విదేశాల‌ సాయం

ఖాట్మండు : భూకంపంతో అతలాకుతలం అయున నేపాల్‌కు విదేశాలు పంపిన సహాయ సామగ్రి అంతా కస్టమ్స్‌ నిబంధనలతో ఖాట్మండు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే మూలుగుతోంది. టార్పాలిన్లు, టెంట్లపై పన్నును మినహాయించిన నేపాల్‌.. మిగతా వాటిపైనా కస్టమ్స్‌ ఆంక్షలను సడలిస్తే సహాయ సామగ్రి సులువుగా తరలించే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్‌ ప్రతినిధి జేవీ మెక్‌గోల్డ్‌రిక్‌ అన్నారు. దీనికి సంబంధించి నేపాల్‌ ఆర్థిక మంత్రి రామ్‌ శరణ్‌ మాట్లాడుతూ ‘‘మాకు ట్యూనా చేపలు, మయోనైజ్‌ (ఓ రకమైన చిక్కటి సాస్) […]

ఖాట్మండు : భూకంపంతో అతలాకుతలం అయున నేపాల్‌కు విదేశాలు పంపిన సహాయ సామగ్రి అంతా కస్టమ్స్‌ నిబంధనలతో ఖాట్మండు అంతర్జాతీయ విమానాశ్రయంలోనే మూలుగుతోంది. టార్పాలిన్లు, టెంట్లపై పన్నును మినహాయించిన నేపాల్‌.. మిగతా వాటిపైనా కస్టమ్స్‌ ఆంక్షలను సడలిస్తే సహాయ సామగ్రి సులువుగా తరలించే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్‌ ప్రతినిధి జేవీ మెక్‌గోల్డ్‌రిక్‌ అన్నారు. దీనికి సంబంధించి నేపాల్‌ ఆర్థిక మంత్రి రామ్‌ శరణ్‌ మాట్లాడుతూ ‘‘మాకు ట్యూనా చేపలు, మయోనైజ్‌ (ఓ రకమైన చిక్కటి సాస్) వంటివి అవసరం లేదు. వాటిని పంపిస్తున్నారు. అవన్నీ మాకెందుకు? ఏం చేసుకుంటాం? టెంట్లు, టార్పాలిన్లు, నిత్యావసర ఆహారపదార్థాలు, ఉప్పు..పప్పు, చక్కెర వంటివి పంపించండి’’ అంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. కాగా ఎయిర్‌పోర్టులో మగ్గుతున్న సహాయ సామగ్రిని తరలించేందుకు అమెరికా మిలటరీ విమానాలు, సిబ్బంది ఖాట్మండుకు చేరుకున్నారు.
Next Story