తిరుమల కాలిబాటలో చిరుతల హల్‌చల్
తిరుపతి : తిరుమల నడక మార్గంలో రెండు చిరుతలు హల్‌చల్ చేశాయి. శ్రీవారి మెట్టు మార్గంలోని 250వ మెట్టు దగ్గర ఈ చిరుతలు ప్రత్యక్షమవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమీపంలో ఉన్న భద్రతా సిబ్బందికి ఈ విషయం తెలియజేయడంతో వారు వెంటనే శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసి వేశారు. భక్తులకు చిరుతలు సంచరిస్తున్నట్టు తెలియజేసి తిప్పి పంపేశారు. అనంతరం అటవీశాఖ విభాగానికి సమాచారం అందించడంతో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. […]
BY Pragnadhar Reddy2 May 2015 8:14 PM IST
Pragnadhar Reddy Updated On: 4 May 2015 6:07 AM IST
తిరుపతి : తిరుమల నడక మార్గంలో రెండు చిరుతలు హల్‌చల్ చేశాయి. శ్రీవారి మెట్టు మార్గంలోని 250వ మెట్టు దగ్గర ఈ చిరుతలు ప్రత్యక్షమవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమీపంలో ఉన్న భద్రతా సిబ్బందికి ఈ విషయం తెలియజేయడంతో వారు వెంటనే శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసి వేశారు. భక్తులకు చిరుతలు సంచరిస్తున్నట్టు తెలియజేసి తిప్పి పంపేశారు. అనంతరం అటవీశాఖ విభాగానికి సమాచారం అందించడంతో సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
నేటి నుంచి పులుల లెక్కింపు కాగా శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆత్మకూరు ఇన్‌చార్జి డివిజనల్ ఫారెస్ట్ అధికారి సాయిబాబు తెలిపారు. టైగర్ రిజర్వ్ పరిధిలో ఆదివారం నుంచి 45 రోజుల పాటు పులుల గణన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పగ్‌మార్క్స్ (పాదముద్రలు), కెమెరా ట్రాప్స్ (ఫొటో చిత్రీకరణ) ద్వారా కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో విస్తరించిన అభయారణ్యం నాగలూటి, ఆత్మకూరు, దోర్నాల రేంజి పరిధిలోని అటవీశాఖ సిబ్బంది పులుల లెక్కింపు చేస్తారన్నారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జాతీయస్థాయిలో వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా ద్వారా పులుల లెక్కింపు జరుగుతుందన్నారు.
Next Story