కొత్త ఇ-ఫారమ్‌తో ఇక కంపెనీల ఏర్పాటు సులువు
న్యూఢిల్లీ : పారిశ్రామిక రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కంపెనీ ఏర్పాటు చేద్దామంటే సవాలక్ష సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి నిన్నామొన్నటి వరకు ఉంది. భారత్‌లో వ్యాపారం సులువు అనే సూత్రంతో కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన ప్రకియను సులభతరం చేసేందుకుగాను ప్రభుత్వం… సమీకృత ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ఫారమ్‌ను ఇపుడు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్‌లో కంపెనీ ఏర్పాటు కోసం దాఖలు చేసుకునే సంస్థలు గతంలో కనీసం ఐదు ఎలక్ట్రానిక్ ఫారమ్స్‌ను విడివిడిగా దాఖలు చేయాల్సి ఉండేది. […]
BY Pragnadhar Reddy2 May 2015 1:10 PM GMT
Pragnadhar Reddy2 May 2015 1:10 PM GMT
న్యూఢిల్లీ : పారిశ్రామిక రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కంపెనీ ఏర్పాటు చేద్దామంటే సవాలక్ష సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి నిన్నామొన్నటి వరకు ఉంది. భారత్‌లో వ్యాపారం సులువు అనే సూత్రంతో కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన ప్రకియను సులభతరం చేసేందుకుగాను ప్రభుత్వం… సమీకృత ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ఫారమ్‌ను ఇపుడు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్‌లో కంపెనీ ఏర్పాటు కోసం దాఖలు చేసుకునే సంస్థలు గతంలో కనీసం ఐదు ఎలక్ట్రానిక్ ఫారమ్స్‌ను విడివిడిగా దాఖలు చేయాల్సి ఉండేది. అయితే తాజాగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త కంపెనీల చట్టం అమల్లో భాగంగా ఐఎన్‌సి 20 ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ పేరు, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డిఐఎన్), రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ కోసం ఈ కొత్త ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్‌లో వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. కొత్త కంపెనీల చట్టంలో కొన్ని సవరణలు చేసి గత ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సరళీకరణలో భాగమే ప్రస్తుత వెసులుబాటు.
Next Story