రియల్టర్‌లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం: రాహుల్
న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు కేంద్రం ప్రతిపాదిస్తున్నసవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. మధ్య తరగతి జీవుల సొంతింటి కలను దూరం చేసే ఈ సవరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎన్‌సీఆర్ ఫ్లాట్ కొనుగోలుదారులతో సమావేశమైన రాహుల్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. మోదీ సర్కారు రైతులను, గిరిజనులతోపాటు మధ్యతరగతి జీవుల భవిష్యత్తునూ అగమ్య గోచరంగా చేస్తోందన్నారు. సర్కారు ప్రతిపాదించిన వందకి పైగా సవరణలు బిల్డర్లకు […]
BY Pragnadhar Reddy3 May 2015 8:57 AM GMT

X
Pragnadhar Reddy3 May 2015 8:57 AM GMT
న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు కేంద్రం ప్రతిపాదిస్తున్నసవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. మధ్య తరగతి జీవుల సొంతింటి కలను దూరం చేసే ఈ సవరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఎన్‌సీఆర్ ఫ్లాట్ కొనుగోలుదారులతో సమావేశమైన రాహుల్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. మోదీ సర్కారు రైతులను, గిరిజనులతోపాటు మధ్యతరగతి జీవుల భవిష్యత్తునూ అగమ్య గోచరంగా చేస్తోందన్నారు. సర్కారు ప్రతిపాదించిన వందకి పైగా సవరణలు బిల్డర్లకు అనుకూలంగా, మధ్యతరగతికి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నామని, ప్రజల పక్షాన నిలుస్తానని చెప్పారు. రియల్ ఎస్టేట్ బిల్లు సవరణలను వ్యతిరేకిస్తూ రాహుల్ చేసిన ప్రకటనకు మద్దతిస్తూ తామంతా రాజ్యసభలో దీనిపై పోరాడతామని కేంద్ర మాజీమంత్రి అజయ్‌మాకెన్ స్పష్టం చేశారు.
Next Story