Telugu Global
Others

ఎంహెచ్‌ జర్నలిస్టు అవార్డుకు ఎంట్రీల అహ్వానం

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్టు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశక్తి సాహితీ సంస్థ తెలిపింది. ఏపీ ప్రెస్‌ అకాడమీ పూర్వ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతనగల కమిటీ దరఖాస్తులను పరిశీలిస్తుందని సంస్థ చైర్మన్‌ తెలిపారు. ‘‘భూమి-బతుకు-భద్రత.. రాజధాని, ప్రాజెక్టుల పేరుతో భూమిని తీసుకున్న ప్ర‌భుత్వం’’ అన్న అంశంపై గ‌త యేడాది మే 1 నుంచి ఈ యేడాది ఏప్రిల్ 30 వరకు తెలుగు పత్రికల్లో రాసిన అంశాలను పంపాల్సిందిగా కోరారు. […]

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్టు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశక్తి సాహితీ సంస్థ తెలిపింది. ఏపీ ప్రెస్‌ అకాడమీ పూర్వ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతనగల కమిటీ దరఖాస్తులను పరిశీలిస్తుందని సంస్థ చైర్మన్‌ తెలిపారు. ‘‘భూమి-బతుకు-భద్రత.. రాజధాని, ప్రాజెక్టుల పేరుతో భూమిని తీసుకున్న ప్ర‌భుత్వం’’ అన్న అంశంపై గ‌త యేడాది మే 1 నుంచి ఈ యేడాది ఏప్రిల్ 30 వరకు తెలుగు పత్రికల్లో రాసిన అంశాలను పంపాల్సిందిగా కోరారు. క‌థ‌నం లేదా వార్తతోపాటు, రాసినట్లు హామీ పత్రం, ఒక ఫోటొతో కూడిన దరఖాస్తును చైర్మన్‌, ప్రజాశక్తి సాహితీ సంస్థ, ప్లాట్‌ నెం.21/1, అజామాబాద్‌, హైదరాబాద్‌-500020 చిరునామాకు పంపాలని పేర్కొన్నారు. ఎంపికైన జర్నలిస్టును జూన్‌ 18న నిర్వహించే హనుమంతరావు పద్నాలుగో స్మారక వర్థంతి సభలో అవార్డుతో సత్కరిస్తామని తెలిపారు.
Next Story