Telugu Global
Others

వడదెబ్బతో తొమ్మిది మంది మృతి

హైద‌రాబాద్ : వడదెబ్బ కారణంగా మృత్యువాతపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో శనివారం తొమ్మిది మంది మరణించారు. వీరిలో కరీంనగర్‌ జిల్లాకు చెందినవారే ముగ్గురున్నారు. ఆదిలాబాద్‌, మెద‌క్ జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో ఒక్కొక్క‌రు చొప్పున చ‌నిపోయారు. వీరిలో ఎక్కువ మంది కూలీనాలీ చేసుకుని బ‌తుకుతున్న వారే. ఎండ‌లో తిరిగి ఇంటికి వ‌చ్చిన వెంట‌నే చ‌నిపోయిన‌వారు, పొలం ప‌నుల్లో పాల్గొంటూ దుర్మ‌ర‌ణం పాల‌యిన వారు ఇందులో ఉన్నారు. ఆదిలాబాద్ […]

హైద‌రాబాద్ : వడదెబ్బ కారణంగా మృత్యువాతపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో శనివారం తొమ్మిది మంది మరణించారు. వీరిలో కరీంనగర్‌ జిల్లాకు చెందినవారే ముగ్గురున్నారు. ఆదిలాబాద్‌, మెద‌క్ జిల్లాల్లో ఇద్ద‌రు చొప్పున‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో ఒక్కొక్క‌రు చొప్పున చ‌నిపోయారు. వీరిలో ఎక్కువ మంది కూలీనాలీ చేసుకుని బ‌తుకుతున్న వారే. ఎండ‌లో తిరిగి ఇంటికి వ‌చ్చిన వెంట‌నే చ‌నిపోయిన‌వారు, పొలం ప‌నుల్లో పాల్గొంటూ దుర్మ‌ర‌ణం పాల‌యిన వారు ఇందులో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఏలేశ్వరం హరీష్‌ (23) శనివారం మధ్యాహ్నం క్రికెట్‌ ఆడుతుండగా మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Next Story