Telugu Global
Others

వైసీపీ, టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక

కడప : ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ఎన్నిక రేప‌టికి వాయిదా ప‌డింది. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న తిరుపేలరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించడంలో కీల‌క‌పాత్ర వ‌హించిన టీడీపీ ఆ స్థానంలో త‌మ మ‌నిషిని కూర్చోబెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ డీసీసీబీలో 11 మంది వైసీపీ డైరెక్ట‌ర్లు, ఆరుగురు టీడీపీ డైరెక్ట‌ర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఇపుడు తెలుగుదేశం పార్టీ వ్యూహంలో మారిపోయింది. వైసీపీలో ఉన్న 11 మందిలో న‌లుగురు టీడీపీ […]

కడప : ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ ఎన్నిక రేప‌టికి వాయిదా ప‌డింది. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న తిరుపేలరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించడంలో కీల‌క‌పాత్ర వ‌హించిన టీడీపీ ఆ స్థానంలో త‌మ మ‌నిషిని కూర్చోబెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ డీసీసీబీలో 11 మంది వైసీపీ డైరెక్ట‌ర్లు, ఆరుగురు టీడీపీ డైరెక్ట‌ర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఇపుడు తెలుగుదేశం పార్టీ వ్యూహంలో మారిపోయింది. వైసీపీలో ఉన్న 11 మందిలో న‌లుగురు టీడీపీ వైపు వ‌చ్చార‌ని ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే టీడీపీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కించుకోవ‌డం ఖాయం. అయితే శ‌నివారం ఈ ఎన్నిక కోసం స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌గా 9 మంది టీడీపీ త‌ర‌ఫున డైరెక్ట‌ర్లు హాజ‌ర‌వ‌గా వైసీపీ త‌ర‌ఫున 8 మంది ఆ ప‌రిస‌రాల్లో క‌నిపించారు. అయితే వీరెవ‌రూ స‌మావేశానికి హాజ‌రుకాలేదు. అంటే ముగ్గురు వైసీపీ డైరెక్ట‌ర్లు టీడీపీకి బాస‌ట‌గా నిలిచార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంటే ఇద్ద‌రి మ‌ధ్య‌ మెజారిటీ ఒకే ఒక్క‌రు. దాంతో కోరం లేద‌ని స‌మావేశం ఆదివారం నాటికి వాయిదా వేశారు. . ఈ ఎన్నిక టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సంఖ్యాబలం ఉండి కూడా పదవిని నిలబెట్టుకోలేకపోతే తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్న కారణంగా ఆ పార్టీ డైరెక్టర్లను కట్టడి చేసేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తోంది. చైర్మన్‌గా ఉన్న తిరుపేలరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించడానికి వ్యూహం వేసి స‌క్సెస్ అయిన టీడీపీ చైర్మన్‌ పదవిని దక్కించుకోకపోతే పరువు సమస్యగా మారుతుందన్న పట్టుదలతో ఉంది. ఇరుపార్టీల నేతలు ధీమాగా పోటీ పడనుండడంతో డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠ రేపే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఒక‌వేళ వైసీపీ డైరెక్ట‌ర్లు వ‌చ్చినా రాకున్నా ఆదివారం ఎన్నిక జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక కారణంగా శని, ఆదివారాల్లో నగరంలో 144 సెక్షన్‌ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
First Published:  1 May 2015 6:45 PM IST
Next Story