రైతుకు బాసటగా ఉంటాం: జగన్
విమానాశ్రయం విస్తరణ పేరుతో ప్రభుత్వం తమ భూములను లాగేసుకోవాలని చూస్తోందని గన్నవరం రైతులు ఆరోపించారు.కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌ను వారు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తమ పార్టీ పేరులోనే రైతులు పేరు ఉందని, అన్నదాతలకు అన్యాయం చేస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని జగన్ అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా బస్ స్టాండు వద్ద ఆయన మే దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురేశారు. కార్మిక, […]
BY Pragnadhar Reddy30 April 2015 3:11 PM GMT
Pragnadhar Reddy30 April 2015 3:11 PM GMT
విమానాశ్రయం విస్తరణ పేరుతో ప్రభుత్వం తమ భూములను లాగేసుకోవాలని చూస్తోందని గన్నవరం రైతులు ఆరోపించారు.కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌ను వారు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. తమ పార్టీ పేరులోనే రైతులు పేరు ఉందని, అన్నదాతలకు అన్యాయం చేస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని జగన్ అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా బస్ స్టాండు వద్ద ఆయన మే దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురేశారు. కార్మిక, కర్షక, శ్రామికులకు తమ పార్టీ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని ఆయన తెలిపారు.
Next Story