కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి గృహనిర్బంధం
కరీంనగర్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటనకు విఘాతం కలిగిస్తారనే అనుమానంతో డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమంపై గోప్యత ప్రదర్శిస్తున్న అధికారుల వైఖరికి నిరసన తెలిపేందుకు సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మృత్యుంజయంను కూడా పోలీసులు గృహం నుంచి రాకుండా నిర్భందించారు. మృత్యుంజయం హౌస్ అరెస్టుపై కరీంనగర్, […]
BY Pragnadhar Reddy30 April 2015 3:02 PM GMT
Pragnadhar Reddy30 April 2015 3:02 PM GMT
కరీంనగర్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటనకు విఘాతం కలిగిస్తారనే అనుమానంతో డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమంపై గోప్యత ప్రదర్శిస్తున్న అధికారుల వైఖరికి నిరసన తెలిపేందుకు సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మృత్యుంజయంను కూడా పోలీసులు గృహం నుంచి రాకుండా నిర్భందించారు. మృత్యుంజయం హౌస్ అరెస్టుపై కరీంనగర్, హుస్నాబాద్, గోదావరిఖనిల్లో కాంగ్రెస్ నేతలు రాస్తారోకోకు దిగారు. రామగుండం, గోదావరిఖనిలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు
Next Story