పాత ఉద్యోగి `నకిలీ పత్రాల` విక్రయం!
బుట్టాయిగూడెం: తహసిల్దారు కార్యాలయం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న బాజీ అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. ఇతను గతంలో తహసిల్దారు కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పని చేశాడు. ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఏ పనులకు ఎవరు వస్తారు… ఎవరికి ఏ పత్రాలు అవసరం అన్న విషయాలు క్షుణ్ణంగా తెలిసిన బాజీ వాటికి నకిలీలు తయారు చేసుకుని తన దగ్గరుంచుకుని అవసరమైన వారికి డబ్బులు తీసుకుని అందజేస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన తహసిల్దారు శుక్రవారం బాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. […]
BY Pragnadhar Reddy30 April 2015 6:37 PM IST
Pragnadhar Reddy Updated On: 1 May 2015 12:39 PM IST
బుట్టాయిగూడెం: తహసిల్దారు కార్యాలయం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న బాజీ అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. ఇతను గతంలో తహసిల్దారు కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పని చేశాడు. ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఏ పనులకు ఎవరు వస్తారు… ఎవరికి ఏ పత్రాలు అవసరం అన్న విషయాలు క్షుణ్ణంగా తెలిసిన బాజీ వాటికి నకిలీలు తయారు చేసుకుని తన దగ్గరుంచుకుని అవసరమైన వారికి డబ్బులు తీసుకుని అందజేస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన తహసిల్దారు శుక్రవారం బాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కార్యాలయానికి సంబంధించిన పలు దస్త్రాలు కనిపించాయి. ఇంకా నకిలీ పాసు పుస్తకాలు, స్టాంపులు పత్రాలు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story