ఏపీకీ ప్రత్యేక హోదా కోసం 2న ఛలో ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మే 2న ఛలో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నట్టు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాలపై ప్రతిపక్షాల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛలో ఢిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. […]
BY sarvi30 April 2015 1:01 PM GMT
sarvi30 April 2015 1:01 PM GMT
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ మే 2న ఛలో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నట్టు ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాలపై ప్రతిపక్షాల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛలో ఢిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను విభజించి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. బ్రిజే్‌షకుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా ఏపీ, తెలంగాణ సీఎంలు చేతులు కలిపి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Next Story