Telugu Global
Others

ఏపీలో చెత్త నుంచి విద్యుత్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్రాజెక్టును ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీలో ప్ర‌క‌టించారు. ఢిల్లీ శివార‌లో ఉన్న 20 మెగావాట్ల చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్రాజెక్టును బాబు సంద‌ర్శించారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ప్ర‌త్య‌క్షంగా తెలుసుక‌న్న ఏపీ సీఎం చాలా సంతృప్తి చెందారు. స్వ‌చ్ఛ భార‌త్ స‌బ్‌క‌మిటీ ఛైర్మ‌న్‌గా ఇటువంటి ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టుల గురించి త‌మ నివేదికలో పొందుప‌రుస్తామ‌ని తెలిపారు. ఇటువంటి ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టులు ముందుగా […]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిలో చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్రాజెక్టును ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీలో ప్ర‌క‌టించారు. ఢిల్లీ శివార‌లో ఉన్న 20 మెగావాట్ల చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్రాజెక్టును బాబు సంద‌ర్శించారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ప్ర‌త్య‌క్షంగా తెలుసుక‌న్న ఏపీ సీఎం చాలా సంతృప్తి చెందారు. స్వ‌చ్ఛ భార‌త్ స‌బ్‌క‌మిటీ ఛైర్మ‌న్‌గా ఇటువంటి ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టుల గురించి త‌మ నివేదికలో పొందుప‌రుస్తామ‌ని తెలిపారు. ఇటువంటి ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టులు ముందుగా ఏపీలో అమ‌లుచేసి ఇత‌ర రాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.
First Published:  30 April 2015 1:02 PM GMT
Next Story