Telugu Global
NEWS

స్వ‌చ్ఛ భార‌త్‌పై బాబు సార‌ధిగా వ‌ర్కింగ్ గ్రూపు ఏర్పాటు

స్వ‌చ్ఛ భార‌త్ నిర్మాణానికి ప‌య‌నం ఎలా ఉండాల‌న్న అంశంపై దిశానిర్దేశం చేయ‌డానికి వ‌ర్కింగ్ గ్రూపు క‌మిటీని ఏర్పాటు చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు.  ఆయ‌న‌ సార‌థ్యంలో గురువారం ఢిల్లీలో ముఖ్య‌మంత్రుల స‌మావేశం జ‌రిగింది. చంద్ర‌బాబు సార‌థిగా ఉండే  ఈ వ‌ర్కింగ్ గ్రూపుకు తొమ్మిది మంది ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈఓ ఈ క‌మిటీకి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ క‌మిటీ ప‌రిశుభ్ర‌త‌, పారిశుద్ధ్యంపై అంత‌ర్జాతీయ స‌మాజం ఎలాంటి విధానాలు అమ‌లు చేస్తుందో తెలుసుకుంటుంద‌ని. అలాగే గ్రామీణ, […]

స్వ‌చ్ఛ భార‌త్‌పై బాబు సార‌ధిగా వ‌ర్కింగ్ గ్రూపు ఏర్పాటు
X
స్వ‌చ్ఛ భార‌త్ నిర్మాణానికి ప‌య‌నం ఎలా ఉండాల‌న్న అంశంపై దిశానిర్దేశం చేయ‌డానికి వ‌ర్కింగ్ గ్రూపు క‌మిటీని ఏర్పాటు చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు. ఆయ‌న‌ సార‌థ్యంలో గురువారం ఢిల్లీలో ముఖ్య‌మంత్రుల స‌మావేశం జ‌రిగింది. చంద్ర‌బాబు సార‌థిగా ఉండే ఈ వ‌ర్కింగ్ గ్రూపుకు తొమ్మిది మంది ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈఓ ఈ క‌మిటీకి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ క‌మిటీ ప‌రిశుభ్ర‌త‌, పారిశుద్ధ్యంపై అంత‌ర్జాతీయ స‌మాజం ఎలాంటి విధానాలు అమ‌లు చేస్తుందో తెలుసుకుంటుంద‌ని. అలాగే గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వ్య‌ర్థాల‌ను ఎలా త‌గ్గించాలి… ఎలా ఉప‌యోగించాల‌న్న అంశాల‌పై సూచ‌న‌లు సిద్ధం చేస్తుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేయ‌డానికి కావ‌ల‌సిన ఆర్థిక వ‌న‌రులు… వాటిని ఎలా వినియోగించాల‌న్న అంశాల‌పై కూడా ఈ క‌మిటీ సూచ‌న‌లు ఇస్తుంద‌ని, ప్ర‌యివేటు రంగాన్ని, పౌర స‌మాజంలోని ముఖ్య‌ సంస్థ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయ‌డానికి కావాల‌సిన వాతావ‌ర‌ణాన్ని సృష్టించ‌డానికి ఈ స్వ‌చ్ఛ భార‌త్ ఉప‌సంఘం స‌ల‌హాల‌ను అందిస్తుందని ఆయ‌న తెలిపారు. చంద్ర‌బాబు క‌న్వీన‌ర్‌గా ఉండే ఈ క‌మిటీలో బీహార్‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, మిజోరం, సిక్కిం, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఉత్త‌రాఖండ్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉంటార‌ని… వీరంతా స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం స‌మ‌ర్థంగా అమ‌లు కావడానికి అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, సల‌హాలు అందిస్తార‌ని చంద్ర‌బాబు తెలిపారు. తామంతా దీనిపై సుదీర్ఘంగా అధ్య‌య‌నం చేసి జూన్‌లోగా కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.
First Published:  30 April 2015 4:49 AM GMT
Next Story