Telugu Global
Others

అప్పుడు భూములు ఇస్తామన్న రైతులూ ఇప్పుడు కోర్టుకు...

హైద‌రాబాద్‌: త‌మ భూముల‌ను ప్ర‌భుత్వం లాక్కొకుండా కాపాడాల‌ని కోరుతూ రాజ‌ధాని న‌గ‌ర‌మైన గుంటూరు జిల్లా నుంచి 300 మంది రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. తాము ప‌త్రాలు రాసిచ్చిన మాట నిజ‌మే అయినా భూములు ఇవ్వ‌డం త‌మ‌కు ఏమాత్రం ఇష్టం లేద‌ని వారు పిటిష‌న్‌లో పేర్కొన్నారు. క‌డుపుకు గుప్పెడ‌న్నం పెట్టే భూములు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇవ్వ‌డం వ‌ల్ల తాము న‌ష్ట‌పోతామ‌ని, త‌మకు భూములు ఇవ్వ‌డం ఇష్టం లేద‌ని, త‌మ భూములు లాక్కోకుండా వెసులుబాటు క‌ల్పించాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశారు రైతులు. […]

అప్పుడు భూములు ఇస్తామన్న రైతులూ ఇప్పుడు కోర్టుకు...
X
హైద‌రాబాద్‌: త‌మ భూముల‌ను ప్ర‌భుత్వం లాక్కొకుండా కాపాడాల‌ని కోరుతూ రాజ‌ధాని న‌గ‌ర‌మైన గుంటూరు జిల్లా నుంచి 300 మంది రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. తాము ప‌త్రాలు రాసిచ్చిన మాట నిజ‌మే అయినా భూములు ఇవ్వ‌డం త‌మ‌కు ఏమాత్రం ఇష్టం లేద‌ని వారు పిటిష‌న్‌లో పేర్కొన్నారు. క‌డుపుకు గుప్పెడ‌న్నం పెట్టే భూములు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇవ్వ‌డం వ‌ల్ల తాము న‌ష్ట‌పోతామ‌ని, త‌మకు భూములు ఇవ్వ‌డం ఇష్టం లేద‌ని, త‌మ భూములు లాక్కోకుండా వెసులుబాటు క‌ల్పించాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశారు రైతులు. ఇంత‌కుముందు ఒక‌సారి 30 మంది రైతులు త‌మ భూములు ప్ర‌భుత్వానికి ఇవ్వ‌కుండా ఉండేందుకు స్టే తెచ్చుకుంటే… అదే తీర్పుతో మ‌రో వంద మంది రైతులు స్టే తెచ్చుకున్నారు. ఈనేథ్యంలో ఇపుడు మ‌రో 300 మంది రైతులు హైకోర్టును ఆశ్ర‌యించి పిటిష‌న్ వేయ‌డ‌మే కాకుండా మ‌రో 300 మంది రైతులు త‌మ బాట‌లోనే ఉన్నార‌ని రాజ‌ధాని ప్రాంత రైతులు చెబుతున్నారు.
Next Story