దుర్గమ్మ కిరీటం చోరీ దొంగ సాహు అరెస్ట్
విజయవాడ : 1998లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు కిరీటం, నగలు దొంగిలించిన గజదొంగ ప్రకాష్ సాహును విజయవాడ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. కృష్ణలంకలోని ఓ లాడ్జిలో సాహు మకాం వేశాడని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జిపై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో 40 కేజీల వెండి సామాగ్రిని దొంగిలించాడు. సీసీ కెమెరా చిత్రాల ఆధారంగా ఈ దొంగతనానికి పాల్పడింది సాహునేనని పోలీసులు నిర్థారించారు. దీంతో అతని […]
విజయవాడ : 1998లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు కిరీటం, నగలు దొంగిలించిన గజదొంగ ప్రకాష్ సాహును విజయవాడ పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. కృష్ణలంకలోని ఓ లాడ్జిలో సాహు మకాం వేశాడని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జిపై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో 40 కేజీల వెండి సామాగ్రిని దొంగిలించాడు. సీసీ కెమెరా చిత్రాల ఆధారంగా ఈ దొంగతనానికి పాల్పడింది సాహునేనని పోలీసులు నిర్థారించారు. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మధ్యప్రదేశ్‌లోని బిలాయ్‌కు చెందిన సాహు ఎలక్ర్టిషియన్ గా పనిచేసేవాడు. తెలుగు రాష్ర్టాలతోపాటు, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ఆలయాల్లో సాహు భారీ దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సాహుని విచారించగా అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఆలయాల్లో దోపిడీలకు పాల్పడ్డానని, భారీ ఎత్తున సొమ్మును దొంగిలించానని వెల్లడించారు. ఇతర రాష్ర్టాల్లోనూ చేసిన దోపిడీల చిట్టా విప్పాడు. దోపిడీ సొమ్ము రికవరీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.