టీఆర్‌ఎస్ కీ పోటీగా టిడీపి భారీ బహిరంగ సభ
తెలంగాణలో ఎలాగైనా నిలదొక్కుకునేందుకు తెలుగుదేశం నానాపాట్లు పడుతోంది. కేసీఆర్‌పై వ్యతిరేకత పెరిగి 2019 నాటికి ఎలాగైనా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని ఊరిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకరినొకరు రెచ్చగొట్టుకునే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించుకుని తన సత్తా చాటుకుంది. అదే మైదానంలో మహానాడు తర్వాత అంతకంటే ఎక్కువ జనంతో మనమూ బహిరంగ సభ నిర్వహిద్దామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన […]
తెలంగాణలో ఎలాగైనా నిలదొక్కుకునేందుకు తెలుగుదేశం నానాపాట్లు పడుతోంది. కేసీఆర్‌పై వ్యతిరేకత పెరిగి 2019 నాటికి ఎలాగైనా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని ఊరిస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకరినొకరు రెచ్చగొట్టుకునే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించుకుని తన సత్తా చాటుకుంది. అదే మైదానంలో మహానాడు తర్వాత అంతకంటే ఎక్కువ జనంతో మనమూ బహిరంగ సభ నిర్వహిద్దామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీ నేతలకు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల నాటికి పార్టీని శక్తివంతం చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు తన సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అందుకే ఈ మహానాడును ఏపీ రాజధానిలో నిర్వహించాలని ముందు అనుకున్నప్పటికీ తెలంగాణ తమ్ముళ్ళ కోరిక తీర్చేందుకు హైదరాబాద్‌లోనే జరపబోతున్నారు. మహానాడు తర్వాత బహిరంగ సభ నిర్వహించి టీఆర్ ఎస్‌కు సవాల్ విసరాలని ఏపీ సీఎం నిశ్చయించుకున్నారు.