రైతు ఆత్మహత్యలపై లోక్‌సభలో రభస
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో వాస్తవాలను మరిచిపోయి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో రైతుల ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించినప్పుడు అధికార పక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతుల సమస్యలతో సతమతమై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన ఆరోపించారు. తాను పంజాబ్ వెళ్ళి అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితిని చూశానని, ప్రధానమంత్రి మోడీ కూడా ఓసారి వెళ్ళి స్వయంగా […]
BY Pragnadhar Reddy29 April 2015 2:15 AM GMT

X
Pragnadhar Reddy29 April 2015 2:15 AM GMT
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో వాస్తవాలను మరిచిపోయి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో రైతుల ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించినప్పుడు అధికార పక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతుల సమస్యలతో సతమతమై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన ఆరోపించారు. తాను పంజాబ్ వెళ్ళి అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితిని చూశానని, ప్రధానమంత్రి మోడీ కూడా ఓసారి వెళ్ళి స్వయంగా పరిస్థితి అంచనా వేస్తే బావుంటుందని ఆయన సూచించారు. అయితే ఈ విషయాలను మాట్లాడుతున్నప్పుడు అధికారపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే బీజేపీ సభ్యురాలు హర్ సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ గత పదేళ్ళ నుంచి రైతులకు, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు మీ ప్రభుత్వం చేసిన సాయమేమిటో వెల్లడించాలని నిలదీశారు.
Next Story