Telugu Global
Cinema & Entertainment

 నందమూరి కాంపౌండ్ లోకి మరోసారి

నిర్మాత దిల్ రాజుకు నందమూరి కుటుంబం, మెగా కాంపౌండ్ అనే తేడా లేదు. వెంచర్ బాగుంటే ఎక్కడైనా పెట్టుబడి పెడతాడు. హీరోకు మార్కెట్ ఉందనిపిస్తే చాలు పెట్టబడి పెట్టడానికి సిద్ధం. కల్యాణ్ రామ్ కు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న దిల్ రాజు, పటాస్ సినిమా హిట్టవ్వడంతో అతడితో సినిమా చేయడానికి సిద్ధమౌతున్నాడు. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇప్పటివరకు తన సినిమాల్ని స్వయంగా […]

 నందమూరి కాంపౌండ్ లోకి మరోసారి
X
నిర్మాత దిల్ రాజుకు నందమూరి కుటుంబం, మెగా కాంపౌండ్ అనే తేడా లేదు. వెంచర్ బాగుంటే ఎక్కడైనా పెట్టుబడి పెడతాడు. హీరోకు మార్కెట్ ఉందనిపిస్తే చాలు పెట్టబడి పెట్టడానికి సిద్ధం. కల్యాణ్ రామ్ కు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న దిల్ రాజు, పటాస్ సినిమా హిట్టవ్వడంతో అతడితో సినిమా చేయడానికి సిద్ధమౌతున్నాడు. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇప్పటివరకు తన సినిమాల్ని స్వయంగా నిర్మించుకున్న కల్యాణ్ రామ్.. చాలా రోజుల తర్వాత మరో బ్యానర్ లో నటిస్తున్నాడు. అది కూడా దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బ్యానర్ లో కావడం విశేషం. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తాడు కల్యాణ్ రామ్. సురేందర్ రెడ్డి సినిమాని మాత్రం మళ్లీ తన సొంత బ్యానర్ లోనే నిర్మించాలని డిసైడయ్యాడు కల్యాణ్ రామ్.
First Published:  29 April 2015 1:00 AM GMT
Next Story