ఏపీలో 35 వేల కోట్లతో పరిశ్రమలు: చంద్రబాబు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు మంచి అవకాశాలున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తారని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఆయన బుధవారం ఇండస్ట్రియల్ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020 నాటికి రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు పెట్టుబడులుగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 46 కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్న […]
BY Pragnadhar Reddy28 April 2015 1:44 PM GMT

X
Pragnadhar Reddy28 April 2015 1:44 PM GMT
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు మంచి అవకాశాలున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తారని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఆయన బుధవారం ఇండస్ట్రియల్ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020 నాటికి రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు పెట్టుబడులుగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం 46 కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్న అనంతరం అనుమతుల ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుడతారు. కెనడా, జపాన్‌లతోపాటు పలు దేశాల ప్రతినిధులు ఈ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఎంఓయూల వల్ల 35,745 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని, 72,210 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం ఏపీలో విద్యుత్ కొరత లేనేలేదని, పరిశ్రమలు స్థాపించే వారికి ఇదెంతో ఊరటనిస్తుందని ఆయన అన్నారు.
పరిశ్రమలు పెట్టుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అనుమతుల కోసం ఎదురుచూపులు చూడకుండా 21 రోజుల్లో లైసెన్సులతోపాటు అన్ని అనుమతులు రావడానికి సహకరించే సింగిల్ డెస్క్ విధానం అమలులోకి తెచ్చామని ఆయన చెప్పారు. చింతలపూడి ప్రాంతంలో మంచి బొగ్గు ఉన్నట్టు గుర్తించారని, ప్రపంచంలో అత్యంత విలువైన గెలాక్సీ గ్రానైట్ నిల్వలు ప్రకాశం జిల్లాలో, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో లైమ్‌స్టోన్ నిల్వలు ఏపీలో ఉన్నాయని అన్నారు. ఇపుడొచ్చే పెట్టబడులన్నీ టెక్స్‌టైల్, ఆటోమొబైల్, బయో టెక్నాలజీ రంగంలో వస్తున్నాయని చెప్పారు. ఇక్కడ ఉన్న ఖనిజ సంపద పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం ఖాయమని అన్నారు.
Next Story