బరువు తగ్గించే అష్టసూత్రాలు
అధిక బరువుతో సతమతమయ్యేవారు ఈ అష్ట సూత్రాలను పాటిస్తే స్లిమ్‌గా, ట్రిమ్‌గా తయారవడం ఖాయమంటున్నారు బ్రిటిష్ పోషకాహార నిపుణులు. 1. వారానికి ఒకరోజు భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరల సలాడ్ తీసుకోవాలి. దీనివల్ల పోషకాలు, విటమిన్లతో చర్మానికి నిగారింపు కూడా వస్తుంది. 2. హడావిడిగా భోజనం చేసేయడం చెరుపు చేస్తుంది. ఎంత తింటున్నామో తెలియదు. తగిన సమయం చూసుకుని భోంచేయాలి. దానివల్ల ఆహారాన్ని బాగా నములుతారు. దాంతో అది త్వరగా జీర్ణమవుతుంది. 3. సాధ్యమైనంత చిన్న సైజు […]
BY Pragnadhar Reddy29 April 2015 1:11 AM IST
X
Pragnadhar Reddy Updated On: 28 April 2015 4:22 PM IST
అధిక బరువుతో సతమతమయ్యేవారు ఈ అష్ట సూత్రాలను పాటిస్తే స్లిమ్‌గా, ట్రిమ్‌గా తయారవడం ఖాయమంటున్నారు బ్రిటిష్ పోషకాహార నిపుణులు.
1. వారానికి ఒకరోజు భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరల సలాడ్ తీసుకోవాలి. దీనివల్ల పోషకాలు, విటమిన్లతో చర్మానికి నిగారింపు కూడా వస్తుంది.
2. హడావిడిగా భోజనం చేసేయడం చెరుపు చేస్తుంది. ఎంత తింటున్నామో తెలియదు. తగిన సమయం చూసుకుని భోంచేయాలి. దానివల్ల ఆహారాన్ని బాగా నములుతారు. దాంతో అది త్వరగా జీర్ణమవుతుంది.
3. సాధ్యమైనంత చిన్న సైజు ప్లేటులో భోంచేస్తే మనకు తెలియకుండానే పూటకు కనీసం 250 కేలరీలైనా తగ్గించి తింటాం.
4. నిద్ర లేచిన గంటలోగానే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తినడం వల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది.
5. పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం, కొవ్వుని కొంత మేరకు తగ్గించగలదు.
6. వ్యాయామం చేసిన తర్వాత అరగంట నుంచి గంట లోపే భోంచేయడం మేలు. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినపుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.
7. భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మ జాతి పండు సగం తింటే బరువు తగ్గుతారు.
8. వారంలో మూడు రోజులు గుడ్లు, ఒకపూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
Next Story