దుర్గమ్మ గోశాలలో 17 ఆవులు మృతి
విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీకనకదుర్గమ్మ ఆలయ నిర్వహణలో ఉన్న గోశాలలో మరణించిన ఆవుల సంఖ్య 17కు చేరింది. మరో 14 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. గోవులకు కలుషిత ఆహారం పెట్టడమే ఈ దుర్ఘటనకు కారణమని గుర్తించారు. ఈ గోశాలలో 150 వరకు గోవులున్నాయి. వీటికి బొంబాయి రవ్వతో సమకూర్చిన ఆహారాన్ని పెట్టారు. అది తిన్న తర్వాత పరిస్థితి విషమించింది. ఈ రవ్వ మీనార్ అనే బ్రాండ్ పేరుతో వచ్చిందని, దాన్ని వాడడం వల్లే గోవులు చనిపోయాయని చెబుతున్నారు. […]

విజయవాడ: ఇంద్రకీలాద్రి శ్రీకనకదుర్గమ్మ ఆలయ నిర్వహణలో ఉన్న గోశాలలో మరణించిన ఆవుల సంఖ్య 17కు చేరింది. మరో 14 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. గోవులకు కలుషిత ఆహారం పెట్టడమే ఈ దుర్ఘటనకు కారణమని గుర్తించారు. ఈ గోశాలలో 150 వరకు గోవులున్నాయి. వీటికి బొంబాయి రవ్వతో సమకూర్చిన ఆహారాన్ని పెట్టారు. అది తిన్న తర్వాత పరిస్థితి విషమించింది. ఈ రవ్వ మీనార్ అనే బ్రాండ్ పేరుతో వచ్చిందని, దాన్ని వాడడం వల్లే గోవులు చనిపోయాయని చెబుతున్నారు. 15 రోజుల క్రితం ఈ సంస్థ 15 బ్యాగుల రవ్వను సమకూర్చిందని… ఇది కాలం చెల్లినది కావడంతో ఆ దాణాను తిన్న గోవుల్లో వెంటనే ఏడు, తర్వాత చావుబతుకులతో పోరాడి మరో 10 మరణించాయని కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. కాగా గోవులు చనిపోయిన ఘటనలో గోశాల మేనేజర్ లావణ్యపై గోశాల కమిటీ అధ్యక్షుడు రఘురాం చేయిచేసుకున్నారు. ఆవులు చనిపోవడానికి కారణం ఆమేనని రఘురాం ఆరోపిస్తున్నారు. అయితే తనను బలి పశువును చేసేందుకు గోశాల కమిటీ ప్రయత్నిస్తోందని లావణ్య చెబుతున్నారు.