Telugu Global
Others

మైనారిటీ యువతుల పెళ్లికి రూ.50 వేలు

విజ‌య‌వాడ‌ : ఏపీలోని పేద మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వివాహ సందర్భంలో ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘దుల్హన్‌’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద 18 నుంచి 21 ఏళ్ల మైనారిటీ వర్గానికి చెందిన ఆడపిల్లలకు ప్రభుత్వం రూ.50 వేలు అందజేస్తుంది. అర్హులైన యువతులు పెళ్లికి నెల రోజుల ముందుగా ఆర్థిక సాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లికి పదిరోజులు ముందుగా సహాయం అందుతుంది. బాలింతలకు అదనపు ‘ఉపాధి’ వేతనం ఉపాధి […]

విజ‌య‌వాడ‌ : ఏపీలోని పేద మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వివాహ సందర్భంలో ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘దుల్హన్‌’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద 18 నుంచి 21 ఏళ్ల మైనారిటీ వర్గానికి చెందిన ఆడపిల్లలకు ప్రభుత్వం రూ.50 వేలు అందజేస్తుంది. అర్హులైన యువతులు పెళ్లికి నెల రోజుల ముందుగా ఆర్థిక సాయం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లికి పదిరోజులు ముందుగా సహాయం అందుతుంది.
బాలింతలకు అదనపు ‘ఉపాధి’ వేతనం
ఉపాధి హామీ పథకంలో పనిచేసే బాలింతలకు అదనపు ప్రయోజనం చేకూరుస్తూ ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ బి.రామాంజనేయులు ఉత్తర్వులిచ్చారు. ఈ పథకంలో భాగంగా.. ఉపాధి పనులకు హాజరయ్యే బాలింతలకు వేతనంతోపాటు రూ.10 అదనంగా చెల్లిస్తారు. విధిలేక పనులకొచ్చే బాలింతలకు ప‌్రభుత్వం ఈ అదనపు వేతనాన్ని ప్రకటించింది. ఇక వేసవి భత్యం ప్రకారం.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో 20 శాతం తక్కువ పరిమాణంలో పనిచేసినా అదే వేతనం అందిస్తారు. వీటితో పాటు కూలీలకు రోజుకు రూ.5ల చొప్పున తాగునీటి కోసం అందిస్తారు.
Next Story