‘శ్రీ చక్ర గోల్డ్ ఫార్మ్స్’ ఆస్తుల జప్తు!
హైదరాబాద్ : శ్రీ చక్రగోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఆస్తులను జప్తు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శ్రీ చక్రగోల్డ్ కంపెనీతోపాటు యజమానులకు సంబంధించిన రూ.15 కోట్ల ఆస్తి స్వాధీనానికి రంగం సిద్ధమైంది. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అధిక వడ్డీల ఆశ చూపి సుమారు నాలుగువేల మంది మధ్యతరగతి ప్రజల నుంచి శ్రీ చక్రగోల్డ్ కోట్లాది రూపాయలు డిపాజిట్లు సేకరించింది. అయితే బాండ్ల కాల పరిమితి తీరినా, డిపాజిట్‌దారులకు యాజమాన్యం డబ్బులు చెల్లించలేదు. దీంతో […]
హైదరాబాద్ : శ్రీ చక్రగోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఆస్తులను జప్తు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శ్రీ చక్రగోల్డ్ కంపెనీతోపాటు యజమానులకు సంబంధించిన రూ.15 కోట్ల ఆస్తి స్వాధీనానికి రంగం సిద్ధమైంది. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అధిక వడ్డీల ఆశ చూపి సుమారు నాలుగువేల మంది మధ్యతరగతి ప్రజల నుంచి శ్రీ చక్రగోల్డ్ కోట్లాది రూపాయలు డిపాజిట్లు సేకరించింది. అయితే బాండ్ల కాల పరిమితి తీరినా, డిపాజిట్‌దారులకు యాజమాన్యం డబ్బులు చెల్లించలేదు. దీంతో డిపాజిట్ చేసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో 2012లో శ్రీచక్రగోల్డ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో కంపెనీ ఎండీ డి అరుణ, చైర్మన్‌గా ఉన్న ఆమె భర్త దాసరి నాగేంద్రలతోపాటు డైరెక్టర్లను పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు చేసి మోసాలు జరిగాయని తెల్చారు. దీంతో ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో సంస్థ ఆస్తులతోపాటు, ఎండీ, చైర్మన్ తదితరులకు చెందిన రూ.15 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సీఐడీ సిద్ధమైంది. శ్రీ చక్ర యాజమాన్యానికి విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతంలో స్థిరాస్థులు ఎక్కువగా ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.విజయవాడ తదితర ప్రాంతాల్లోని స్థిర, చరాస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.