హోంగార్డులకు జీతం పెంపుపై నేడో రేపో ఉత్తర్వులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల నుంచి హోంగార్డుల గౌరవ వేతనం రూ. 12 వేలకు పెరగనుంది. దీనికి సంబంధించిన ఫైల్ ఎట్టకేలకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పేషీకి చేరింది. సీఎస్ పరిశీలన అనంతరం సీఎం ఆమోదం పొందిన వెంటనే హోంగార్డుల గౌరవ వేతన పెంపునకు సంబంధించి జీవో వెలువడనుంది. ఇప్పటి వరకు రోజువారి గౌరవ వేతనం రూ. 9 వేలుగా ఉన్న […]
BY Pragnadhar Reddy28 April 2015 1:00 AM GMT
Pragnadhar Reddy28 April 2015 1:00 AM GMT
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల నుంచి హోంగార్డుల గౌరవ వేతనం రూ. 12 వేలకు పెరగనుంది. దీనికి సంబంధించిన ఫైల్ ఎట్టకేలకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పేషీకి చేరింది. సీఎస్ పరిశీలన అనంతరం సీఎం ఆమోదం పొందిన వెంటనే హోంగార్డుల గౌరవ వేతన పెంపునకు సంబంధించి జీవో వెలువడనుంది. ఇప్పటి వరకు రోజువారి గౌరవ వేతనం రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డులు తమ జీతం పెంచాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో హోంగార్డులు వచ్చేనెల నుంచి రూ. 12 వేలు గౌరవ వేతనం అందుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19వేల 500 మంది హోంగార్డులు పోలీస్ శాఖతోపాటు ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన హోంగార్డులకు జీతాలు పెరిగితే కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది.
Next Story