స్కూలు బస్సు అగ్నికి ఆహుతి
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో ఓ స్కూలు బస్సు అగ్నికి ఆహుతయ్యింది. ఉదయమే స్కూలు కోసం విద్యార్థులను తీసుకువచ్చిన డ్రైవర్ ప్రమాదానికి 10 నిమషాల ముందే వారిని బస్సు నుంచి కిందికి దింపాడు. ఆ తర్వాత తాను, క్లీనర్ కూడా కిందకి దిగి పక్కకి వెళ్ళిన వెంటనే ఈ సంఘటన జరిగింది. స్కూలు క్యాంపస్‌లో ఉన్న విద్యుత్ వైరు తెగి పడడంతో బస్సుకు నిప్పంటుకుని కొన్ని నిమషాల వ్యవధిలోనే పూర్తిగా కాలి పోయింది. బస్సు నుంచి ఎగిసిపడుతున్న […]
BY Pragnadhar Reddy27 April 2015 3:00 PM GMT
Pragnadhar Reddy27 April 2015 3:00 PM GMT
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో ఓ స్కూలు బస్సు అగ్నికి ఆహుతయ్యింది. ఉదయమే స్కూలు కోసం విద్యార్థులను తీసుకువచ్చిన డ్రైవర్ ప్రమాదానికి 10 నిమషాల ముందే వారిని బస్సు నుంచి కిందికి దింపాడు. ఆ తర్వాత తాను, క్లీనర్ కూడా కిందకి దిగి పక్కకి వెళ్ళిన వెంటనే ఈ సంఘటన జరిగింది. స్కూలు క్యాంపస్‌లో ఉన్న విద్యుత్ వైరు తెగి పడడంతో బస్సుకు నిప్పంటుకుని కొన్ని నిమషాల వ్యవధిలోనే పూర్తిగా కాలి పోయింది. బస్సు నుంచి ఎగిసిపడుతున్న మంటలు చూసి పిల్లలు బెంబేలెత్తి పో్యారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పినందుకు స్కూలు యాజమాన్యం, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story