రాహుల్ వల్లే నేపాల్ భూకంపం!
నేపాల్‌లో సంభవించిన భూకంపానికి,రాహుల్ కి అనుసంధానం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాద్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి తెరలేపాయి. రాహుల్‌గాంధీ కేధార్‌నాథ్ సందర్శన వల్లే నేపాల్‌లో ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆమెతోపాటు భారతీయ జనతా పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన ప్రకటన ఇపుడు మరో వివాదం సృష్టించనుంది. హరిద్వార్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆవు మాసం తిన్న రాహుల్‌గాంధీ తనకు తాను పరిశుద్ధుడు కాకుండానే కేధార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడం వల్లే భూకంపం సంభవించిందని, […]
BY Pragnadhar Reddy28 April 2015 2:44 PM IST

X
Pragnadhar Reddy Updated On: 29 April 2015 5:47 AM IST
నేపాల్‌లో సంభవించిన భూకంపానికి,రాహుల్ కి అనుసంధానం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాద్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి తెరలేపాయి. రాహుల్‌గాంధీ కేధార్‌నాథ్ సందర్శన వల్లే నేపాల్‌లో ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆమెతోపాటు భారతీయ జనతా పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన ప్రకటన ఇపుడు మరో వివాదం సృష్టించనుంది. హరిద్వార్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆవు మాసం తిన్న రాహుల్‌గాంధీ తనకు తాను పరిశుద్ధుడు కాకుండానే కేధార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడం వల్లే భూకంపం సంభవించిందని, ప్రాచీ, సాక్షి మహరాజ్ ఆరోపించారు. మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజంటంటూ సాద్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యల వలన చెలరేగిన దుమారం ఇంకా సమసిపోక ముందే ఆమె మళ్ళీ మరో కొత్త వివాదానికి తెర తీశారు. భారత్ మాతాకీ జై అని, వందేమాతరం అని పలకని వాళ్ళు,.. జాతీయ పతాకాన్ని అవమానించేవారు, గోవధను తప్పు పట్టనివారు భారతదేశంలో ఉండడానికి అర్హులు కాదని కూడా గతంలో సాద్వి వ్యాఖ్యానించి వివాదాన్ని లేపారు. మళ్ళీ ఇపుడు రాహుల్‌గాంధీ కేధార్‌నాథ్ పర్యటనకు… నేపాల్ భూకంపానికి ముడి పెట్టి సాద్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారాన్ని రేపుతాయో చూడాలి.
Next Story