Telugu Global
Others

నేపాల్‌ను పునర్నిర్మిద్దాం: మోడీ

న్యూ ఢిల్లీ : నేపాల్‌ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుతామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విషాదం సమయంలో నేపాల్‌ ప్రజలు ఒంటరి వారు కాదని, వారికి అండగా తాము నిలుస్తామని భరోసా ఇచ్చారు. సహాయక చర్యలతో నేపాల్‌ దేశస్థులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్ప‌టికే కొన్ని ఆహార ప‌దార్థాలు, మందుల‌తో నేపాల్‌కు స‌హాయ బృందాల‌ను, హెలికాప్ట‌ర్‌ల‌ను పంపామ‌ని ఆయ‌న తెలిపారు. దాదాపు 10 వేల మంది చ‌నిపోయిన‌ట్టు చెబుతున్న నేపాల్‌కు వ‌చ్చిన క‌ష్టం […]

న్యూ ఢిల్లీ : నేపాల్‌ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుతామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విషాదం సమయంలో నేపాల్‌ ప్రజలు ఒంటరి వారు కాదని, వారికి అండగా తాము నిలుస్తామని భరోసా ఇచ్చారు. సహాయక చర్యలతో నేపాల్‌ దేశస్థులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్ప‌టికే కొన్ని ఆహార ప‌దార్థాలు, మందుల‌తో నేపాల్‌కు స‌హాయ బృందాల‌ను, హెలికాప్ట‌ర్‌ల‌ను పంపామ‌ని ఆయ‌న తెలిపారు. దాదాపు 10 వేల మంది చ‌నిపోయిన‌ట్టు చెబుతున్న నేపాల్‌కు వ‌చ్చిన క‌ష్టం మ‌రెవ‌రికీ రాకూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచం మొత్తం నేపాల్‌కు అండ‌గా ఉండి పున‌ర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌ని మోడీ ఆకాంక్షించారు.
First Published:  28 April 2015 6:37 AM IST
Next Story