జీహెచ్ ఎంసీ ఎన్నికలకు లైన్ క్లియర్..
గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నిలకు రంగం సిద్ధమైంది. ఎప్పుడో గడువు పూర్తయినా నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. ఓడిపోతానన్న భయంతో గ్రేటర్ ఎన్నికలను వీలైంత ఆలస్యం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి హైకోర్టు వార్నింగ్‌తో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. గతంలో హైదరాబాద్ నగరపాలక సంస్థలో పోటీ చేయడానికే కేసీఆర్ పార్టీ వెనకడుగు వేసింది. ఓటమి భయంతోనే ఆనాడు పోటీచేయలేదన్న విషయం తెలిసిందే. ఇప్పడు తెలంగాణ రాష్ట్రం […]

గ్రేటర్ హైదరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నిలకు రంగం సిద్ధమైంది. ఎప్పుడో గడువు పూర్తయినా నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. ఓడిపోతానన్న భయంతో గ్రేటర్ ఎన్నికలను వీలైంత ఆలస్యం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి హైకోర్టు వార్నింగ్‌తో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. గతంలో హైదరాబాద్ నగరపాలక సంస్థలో పోటీ చేయడానికే కేసీఆర్ పార్టీ వెనకడుగు వేసింది. ఓటమి భయంతోనే ఆనాడు పోటీచేయలేదన్న విషయం తెలిసిందే. ఇప్పడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అధికారం చేతిలో ఉంది. అయినా భయపడుతోంది. హైదరాబాద్‌లో పట్టులేదన్న సంగతి తెలుసుగనుకే తెలుగుదేశం నాయకులందరినీ తన పార్టీలో కలిపేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలనుకున్నారు. కాని ఈలోగా హైకోర్టు మొట్టికాయలతో డిసెంబర్ నాటికి ఎన్నికలు పూర్తి చేయక తప్పదు. అందుకే మాటి మాటికి హైదరాబాద్‌ను విశ్వ నగరం చేస్తానంటూ ఊదరగొడుతున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృధిని గాలికొదిలేసి తనవల్ల హైదరాబాద్‌కు ఎప్పుడో అంతర్జాతీయ గుర్తింపువచ్చిందని ఇప్పుడు కొత్తగా వచ్చేదేమీ లేదని ప్రచారం చేసుకుంటున్నారు.