Telugu Global
Others

ప్రధానికి సారీ చెప్పిన చీఫ్‌ జస్టిస్!

న్యూఢిల్లీ : జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)కు ఇద్దరు ప్రముఖులను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీలో భాగస్వామిగా ఉండేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు నిరాకరించారు. ఈ మేరకు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజా పరిణామంతో న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులను నిర్ణయించే కొత్త వ్యవస్థ ఎన్‌జేఏసీ సంక్షోభంలో పడింది. మూడు దశాబ్దాల కొలీజియం వ్యవస్థకు ఎన్డీయే ప్రభుత్వం చరమగీతం పాడిన సంగతి తెలిసిందే. దాని స్థానంలో […]

న్యూఢిల్లీ : జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)కు ఇద్దరు ప్రముఖులను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీలో భాగస్వామిగా ఉండేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు నిరాకరించారు. ఈ మేరకు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజా పరిణామంతో న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతులను నిర్ణయించే కొత్త వ్యవస్థ ఎన్‌జేఏసీ సంక్షోభంలో పడింది. మూడు దశాబ్దాల కొలీజియం వ్యవస్థకు ఎన్డీయే ప్రభుత్వం చరమగీతం పాడిన సంగతి తెలిసిందే. దాని స్థానంలో ఎన్‌జేఏసీ చట్టం అమలుకు ఇటీవలే పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. దాని ప్రకారం, కొలీజియం స్థానంలో న్యాయ నియామకాలన్నిటినీ ఆరుగురు సభ్యుల కమిటీ చేపడుతుంది. ఈ కమిటీలో ఇద్దరు ప్రముఖులను ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత కలిసి ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలోనే, ఇద్దరు ప్రముఖుల ఎంపికకు సమావేశానికి రావాలంటూ ఇటీవలే ప్రభుత్వం సుప్రీం చీఫ్‌ జస్టిస్ కు లేఖ రాసింది కూడా. ఆయ‌న తాను రాలేనంటూ ప్రధానికి సారీ చెప్పేశారు. దత్తు లేఖతో సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో న్యాయ నియామకాలు గందరగోళంలో పడ్డాయని, ఆ సమావేశాలకు చీఫ్‌ జస్టిస్‌ హాజరు కావాలంటూ రాజ్యాంగ ధర్మాసనం ఆయనకు సూచించాలని కోరారు.
Next Story