ఇంటర్ సెకండ్ ఇయర్‌లోనూ బాలికలదే పైచేయి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలను విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 4,03,496 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,90,789 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే 72.07 మంది పరీక్షల్లో పాసయ్యారు. ఈ పరీక్షలకు హాజరయిన ప్రయివేటు విద్యార్థినీ విద్యార్థుల్లో 33.79 శాతం మంది పాసయ్యారు. ఈ ఫలితాల్లో కృష్ణాజిల్లా 83 శాతంతో మొదటి స్థానంలో నిలవగా 50 శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా ఆఖరి స్థానంలో నిలిచాయి. పరీక్షా ఫలితాల్లో తెలంగాణ […]
BY Pragnadhar Reddy27 April 2015 7:40 PM IST
Pragnadhar Reddy Updated On: 28 April 2015 6:31 AM IST
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాలను విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 4,03,496 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,90,789 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే 72.07 మంది పరీక్షల్లో పాసయ్యారు. ఈ పరీక్షలకు హాజరయిన ప్రయివేటు విద్యార్థినీ విద్యార్థుల్లో 33.79 శాతం మంది పాసయ్యారు. ఈ ఫలితాల్లో కృష్ణాజిల్లా 83 శాతంతో మొదటి స్థానంలో నిలవగా 50 శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా ఆఖరి స్థానంలో నిలిచాయి. పరీక్షా ఫలితాల్లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గత యేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణతా శాతం 1.19 అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఈసారి పాసయిన విద్యార్థుల్లో బాలురు 69.43 శాతం కాగా బాలికలు 74.80 శాతం. అంటే బాలురు కంటే బాలికలే 5.37 శాతం అధికంగా పాసయ్యారన్న మాట… మే 2వ తేదీ నుంచి మార్కుల మెమోలు జారీ చేస్తారని, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు వచ్చేనెల 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల 25వ తేదీ నుంచి జరుగుతాయని మంత్రి తెలిపారు.
Next Story