నోరు జారిన చంద్రబాబు....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేసే లక్ష్యంతో పావులు కదుపుతున్న కేసీఆర్ ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను నయానో, భయానో, ప్రలోభాలతోనో టీఆర్ ఎస్‌లో కలిపేసుకుంటున్నారు.ఇదే పని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా చేశారు. కాంగ్రెస్ నుంచి, వైసిపి నుంచి నాయకులను తన పార్టీలో చేర్చుకున్నారు. వీరిద్దరి మధ్యా వైరం అటు పాలనా పరంగాను..ఇటు పార్టీల పరంగానూ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా […]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేసే లక్ష్యంతో పావులు కదుపుతున్న కేసీఆర్ ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను నయానో, భయానో, ప్రలోభాలతోనో టీఆర్ ఎస్‌లో కలిపేసుకుంటున్నారు.ఇదే పని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా చేశారు. కాంగ్రెస్ నుంచి, వైసిపి నుంచి నాయకులను తన పార్టీలో చేర్చుకున్నారు.
వీరిద్దరి మధ్యా వైరం అటు పాలనా పరంగాను..ఇటు పార్టీల పరంగానూ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు తమ పార్టీని ఎవరూ ఏమి చేయలేరన్న ధీమా వ్యక్తం చేశారు. నాయకులు పోయినా, కార్యకర్తలు ఇంకా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు నోరు పారేసుకుంటూ నా దగ్గర పని చేసిన వ్యక్తి నన్నే అంటాడా అంటూ కేసిఆర్ పై అనవసరపు మాటలు మాట్లాడాడు. ఇది తెలిసి టీఆర్ ఎస్ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ తన ప్రసంగంలో టీడీపీ పట్ల వైషమ్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. చంద్రబాబునాయుడ్ని కిరికిరి నాయడుగా అభివర్ణిస్తూ నోటికొచ్చినట్లుగా మాట్లాడారు.
చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో మీటింగ్ పెట్టిన ప్రతిసారి కొందరు నేతలు, ఒక్కో ఎమ్మెల్యే పార్టీ నుంచి జంప్ చేస్తున్నారు. ఎలాగైనా గ్రేటర్ ఎన్నికల నాటికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు చేయడమే కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలో కేసీఆర్ ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో ఏపీలో చంద్రబాబు అవేరాజకీయాలు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే తాను ముక్కలు కావడంతో ఒకరి లోపాలు ఒకరికి తెలుసు, ఒకరి తెలివితేటలు మరొకరికి తెలుసు. అందుకే పందెం కోళ్ళ మాదిరిగా ఇద్దరు చంద్రులు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు.