Telugu Global
Others

బంగారు తెలంగాణ కోస‌మే నాజీవితం అంకితం: కేసీఆర్‌

హైదరాబాద్ : ‘‘ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ సాధించ‌డం కోసం పోరాడాను. ఇక‌నుంచి బంగారు తెలంగాణ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను’’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశం నుంచి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రితం జలదృశ్యంలో పిడికెడు మందితో తెలంగాణ పోరాటం ప్రారంభమైందని, […]

బంగారు తెలంగాణ కోస‌మే నాజీవితం అంకితం: కేసీఆర్‌
X
హైదరాబాద్ : ‘‘ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ సాధించ‌డం కోసం పోరాడాను. ఇక‌నుంచి బంగారు తెలంగాణ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను’’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశం నుంచి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రితం జలదృశ్యంలో పిడికెడు మందితో తెలంగాణ పోరాటం ప్రారంభమైందని, సమైక్య పాలకులతో అద్భుతంగా పోరాడి తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకున్నామని అన్నారు. ఉద్యమ సాధనంలో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కళాకారులు, యావత్‌ తెలంగాణ ప్రజల పోరాటం అనన్య సమాన్యమైనదని కొనియాడారు. ఎన్నో ఆటంకాలను అధిగమించి, ప్రత్యేక రాష్ట్రం కోసం దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించామని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్‌ ధరలు పెంచకూడదని అడిగినందుకు రాజధాని నడిబొడ్డున బషీర్‌బాగ్‌లో కాల్చిచంపారని, తెలంగాణ యువకులకు కనీసం చప్రాసి ఉద్యోగాలు కూడా లభించకుండా సమైక్య పాలకులు 14 ఎఫ్‌ను సవరించే దుర్మార్గపు చర్యకు పూనుకున్నారని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో తెలంగాణ సాధనే లక్ష్యంగా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో’ నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టానన్నారు. అయితే శ్రీకాంతాచారి చనిపోవడం తనను కలిచివేసిందని, ఎంతగానో ఏడ్చానని కేసీఆర్‌ చెప్పారు. తాను చావు అంచుల‌ వరకు వెళ్లి మృత్యువును ముద్దాడే క్షణంలో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు కుట్రలు పన్ని తెలంగాణ ప్రకటనను కేంద్రం వెనక్కు తీసుకునేలా చేశారని దుయ్యబట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ కోసం పోరాడిన తాను ఇక నుంచి బంగారు తెలంగాణ కోసం ప‌ని చేస్తాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత‌ నేపాల్‌లో భూకంపం దుర్ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున నేపాల్‌ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేస్తామన్నారు.
Next Story