Telugu Global
Others

కొడుకుని చంపించిన తండ్రి

శ్రీకాళహస్తి : తనను చంపుతాడని భయపడి ఏకంగా కన్నకొడుకునే కడతేర్చాడో తండ్రి. కష్టపడి ఇంజనీరింగు చదివిస్తే విలాసాలకు అలవాటుపడిన ఆ కొడుకు డబ్బుకోసం వేధించడం, కొట్టడం భరించలేక కిరాయి హంతకులతో చంపించాడో కన్నతండ్రి. చిత్తూరుజిల్లా తొట్టంబేడు మండలం దిగువసాంబయ్యపాళెంలో ఈ సంఘటన జరిగింది. మునిశేఖర్‌, భార్య మునెమ్మ కొంతకాలం కిందట తిరుపతికి వెళ్లి స్థిరపడ్డారు. మునిశేఖర్‌ తిరుమలలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు కుమారుడు రాంబాబు(24), కుమార్తె మోహనరోజా(20) ఉన్నారు. రాంబాబు రెండేళ్ల కిందట […]

కొడుకుని చంపించిన తండ్రి
X
శ్రీకాళహస్తి : తనను చంపుతాడని భయపడి ఏకంగా కన్నకొడుకునే కడతేర్చాడో తండ్రి. కష్టపడి ఇంజనీరింగు చదివిస్తే విలాసాలకు అలవాటుపడిన ఆ కొడుకు డబ్బుకోసం వేధించడం, కొట్టడం భరించలేక కిరాయి హంతకులతో చంపించాడో కన్నతండ్రి. చిత్తూరుజిల్లా తొట్టంబేడు మండలం దిగువసాంబయ్యపాళెంలో ఈ సంఘటన జరిగింది. మునిశేఖర్‌, భార్య మునెమ్మ కొంతకాలం కిందట తిరుపతికి వెళ్లి స్థిరపడ్డారు. మునిశేఖర్‌ తిరుమలలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు కుమారుడు రాంబాబు(24), కుమార్తె మోహనరోజా(20) ఉన్నారు. రాంబాబు రెండేళ్ల కిందట ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో ఇంటివద్దే ఉంట‌ూ మద్యానికి అలవాటు పడ్డాడు. తరచూ తండ్రిని డబ్బడిగేవాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తేది. దాడులు చేసుకునే వరకు వచ్చింది. తండ్రిపై దాడిచేసే సమయంలో అడ్డువచ్చే అమ్మ, చెల్లి, తాతను కూడా రాంబాబు చితకబాదేవాడు. కుటుంబసభ్యులందరినీ హతమారుస్తానని బెదిరించేవాడు. తమను ఎక్కడ చంపేస్తాడో అనే భ‌యంతో మునిశేఖర్‌ ఏకంగా కుమారుడిని హతమార్చడానికి తిరుపతికి చెందిన ఇద్దరు యువకులను కిరాయికి కుదుర్చుకున్నాడు. నాన్నమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి రాంబాబును దిగువ సాంబయ్యపాళేనికి బైక్‌పై తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న కిరాయి హంతకులు రాంబాబుపై దాడికి దిగారు. వారికి మునిశేఖర్‌ కూడా సహకరించాడు. రాంబాబును కర్రలతో మోది హతమార్చాక హంతకులు పారిపోయారు.
Next Story