Telugu Global
Others

బంగారు తెలంగాణ‌కు పార్టీ దిక్సూచి కావాలి: ప‌్లీన‌రీలో తీర్మానం

తెలంగాణ రాష్ట్ర స‌మితి అస‌లు ల‌క్ష్యం తెలంగాణ సాధ‌న అని అది నేర‌వేరింద‌ని… బంగారు తెలంగాణ సాధ‌న‌లో ప్ర‌భుత్వానికి దిక్సూచిగా ప‌ని చేయ‌డానికి వీలుగా పార్టీని వ్య‌వ‌స్థాగ‌తంగా నిర్మించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇందుకోసం ప‌టిష్టంగా, ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముంద‌డుగు వేయాల్సి ఉంద‌ని చెబుతూ టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణం కోసం తీర్మానాన్ని ఉద్యోగ సంఘాల నాయ‌కుడు, తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ముఖ్య పాత్ర‌ధారి దేవీ ప్ర‌సాద్ ప్ర‌వేశ పెట్టారు. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చి దిద్దే ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకున్న‌ట్టు చెబుతూ దీనికి […]

తెలంగాణ రాష్ట్ర స‌మితి అస‌లు ల‌క్ష్యం తెలంగాణ సాధ‌న అని అది నేర‌వేరింద‌ని… బంగారు తెలంగాణ సాధ‌న‌లో ప్ర‌భుత్వానికి దిక్సూచిగా ప‌ని చేయ‌డానికి వీలుగా పార్టీని వ్య‌వ‌స్థాగ‌తంగా నిర్మించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇందుకోసం ప‌టిష్టంగా, ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముంద‌డుగు వేయాల్సి ఉంద‌ని చెబుతూ టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణం కోసం తీర్మానాన్ని ఉద్యోగ సంఘాల నాయ‌కుడు, తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో ముఖ్య పాత్ర‌ధారి దేవీ ప్ర‌సాద్ ప్ర‌వేశ పెట్టారు. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చి దిద్దే ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకున్న‌ట్టు చెబుతూ దీనికి సంబంధించిన తీర్మానాన్ని వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టారు. తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం మ‌నుగ‌డ సాగిస్తుంద‌ని తెలిపే తీర్మానాన్ని మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి ప్ర‌వేశ‌పెట్టారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించిన క‌ళాకారులు, సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించే తీర్మానాన్ని నార‌దాసు ల‌క్ష్మ‌ణ‌రావు ప్ర‌వేశ‌పెట్టారు. నీళ్ళు, నియ‌మాకాలు, నిధుల కోసమే పోరాటం చేస్తున్నామ‌ని దేవాదుల‌కు నాలుగేళ్ల‌లో నీరిస్తామ‌న్నార‌ని, ద‌శాబ్దాలు గడిచినా నీళ్ళు రాలేద‌ని హ‌రీష్‌రావు చెబుతూ… వ్య‌వ‌సాయం, నీటిపారుద‌ల‌, మిష‌న్ కాక‌తీయపై ప్లీన‌రీలో ఐదో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. విద్యుత్ రంగంలో స్వావ‌లంబ‌న సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా రాబోయే నాలుగేళ్ళ‌లో 24 వేల మెగావాట్ల ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌య‌నిస్తోంద‌ని చెబుతూ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి విద్యుత్ రంగంపై ఆరో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అన్ని రంగాల్లోను, ప్ర‌జా జీవితంలోను మౌలిక వ‌స‌తుల అవ‌స‌రాన్ని గుర్తు చేస్తూ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు మౌలిక వ‌స‌తుల‌పై ఏడో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌తి ఇంటికి న‌ల్లా సౌక‌ర్యం క‌ల్పించాల‌న్న ముఖ్య‌మంత్రి సంక‌ల్పానికి అనుగుణంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, అలాగే తాము ప్ర‌వేశ‌పెట్టే పారిశ్రామిక విధానం పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షిస్తుంద‌ని చెబుతూ ఐటి మంత్రి కేటీఆర్ తాగునీటి, పారిశ్రామిక రంగాల‌పై తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. వ‌ర్త‌మాన రాజ‌కీయాల స‌ర‌ళిలో టీఆర్ఎస్ ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశంపై మంత్రి ఈటెల రాజేందర్ తొమ్మిదో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు.
Next Story