Telugu Global
Cinema & Entertainment

గబ్బర్ సింగే బెంగాల్ టైగరా ?

మాస్ రాజా ర‌వితేజా న‌టిస్తున్న బెంగాల్ టైగ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం రామోజి ఫిల్మ్ సిటిలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా తో పాటు..రాసి ఖ‌న్నా కూడా న‌టిస్తుంది. ద‌ర్శకుడు రాధా మోహ‌న్ నిర్మాత‌. ప‌క్కా మాస్ మ‌సాల అంశాల‌తో ర‌వితేజ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కిస్తున్నారట ఈ చిత్రం. ఫిల్మ్ సిటిలో ప‌లు కీల‌క స‌న్నివేశాలను ప్ర‌స్తుతం షూట్ చేస్తున్నారు. బాలీవుడ్ […]

గబ్బర్ సింగే బెంగాల్ టైగరా ?
X

మాస్ రాజా ర‌వితేజా న‌టిస్తున్న బెంగాల్ టైగ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం రామోజి ఫిల్మ్ సిటిలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా తో పాటు..రాసి ఖ‌న్నా కూడా న‌టిస్తుంది. ద‌ర్శకుడు రాధా మోహ‌న్ నిర్మాత‌. ప‌క్కా మాస్ మ‌సాల అంశాల‌తో ర‌వితేజ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కిస్తున్నారట ఈ చిత్రం. ఫిల్మ్ సిటిలో ప‌లు కీల‌క స‌న్నివేశాలను ప్ర‌స్తుతం షూట్ చేస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరానీ ఓ ప్రధాన రోల్ కనబడబోతున్నారు.

ద‌ర్శ‌క నిర్మాత‌లు రిలీజ్ డేట్ ను ఈ యేడాది సెప్టెంబ‌ర్ 17 న విడుదల చేయబోతున్నటు ముందుగానే ఎనౌన్స్ చేయ‌డం విశేషం. ర‌చ్చ చిత్రం త‌రువాత డైరెక్ట‌ర్ సంప‌త్ నంది చాల కాలం ప‌వ‌ర్ స్టార్ గ‌బ్బ‌ర్ సీక్వెల్ కోసం వ‌ర్కువుట్ చేశాడు. అయితే అయిన త‌యారు చేసిన వెర్ష‌న్ అంత‌గా ప‌వ‌ర్ స్టార్ కు న‌చ్చ‌క పోవ‌డంతో.. వెంట‌నే అదే స్టోరిని కొద్ది మార్పుల‌తో బెంగాల్ టైగ‌ర్ గా చేస్తున్నారు అనేది ఇంట‌ర్న‌ల్ గా వినిపిస్తున్న టాక్. ఏదైతేనేమి బొమ్మ బాక్సాఫీస్ ను షేక్ చేయ‌డం అనేది ఇంపార్టెంట్ .

First Published:  24 April 2015 1:55 AM GMT
Next Story