చంద్రబాబు కరుణిస్తేనే ... తిరుమలేశుని సన్నిధికి...
అంతా అయిపోయిందంటారు..ఇదిగో ఏ రోజైనా రెడీగా వుండండి అంటారు…తీరా చూస్తే 9 నెలలనుంచి ఎదురు చూసి కళ్లు కాయలు కాస్తున్నాయే కానీ, ఆశలు మాత్రం నెరవేరడం లేదు. ఏడు కొండల వాడా ..వెంకటరమణా గోవిందా గోవిందా.. అంటూ కొండకు చేరుతున్న భక్తులు దర్శనం ముగించుకుని పోతున్నారు..కానీ 9 నెలలుగా 17 మంది వీరభక్తులు మాత్రం కొండకు ఎప్పుడు చేరతామనే ఆశలతో అలిపిరి మెట్ల దగ్గర పచార్లు చేస్తున్నారు,, ఏపి సర్కారు నియమిస్తామన్న టీటీడి పాలక మండలిని […]
అంతా అయిపోయిందంటారు..ఇదిగో ఏ రోజైనా రెడీగా వుండండి అంటారు…తీరా చూస్తే 9 నెలలనుంచి ఎదురు చూసి కళ్లు కాయలు కాస్తున్నాయే కానీ, ఆశలు మాత్రం నెరవేరడం లేదు. ఏడు కొండల వాడా ..వెంకటరమణా గోవిందా గోవిందా.. అంటూ కొండకు చేరుతున్న భక్తులు దర్శనం ముగించుకుని పోతున్నారు..కానీ 9 నెలలుగా 17 మంది వీరభక్తులు మాత్రం కొండకు ఎప్పుడు చేరతామనే ఆశలతో అలిపిరి మెట్ల దగ్గర పచార్లు చేస్తున్నారు,, ఏపి సర్కారు నియమిస్తామన్న టీటీడి పాలక మండలిని ఎన్నడు అధికారికంగా ప్రకటిస్తుందో తెలియక జుట్టుపీకుంటున్నారు. చదలవాడకు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చి వుండటంతో ఆయన ప్రశాంతంగా వున్నారని తమకెప్పుడు అధికారికంగా చెబుతారన్న దానిపై సస్పెన్స్ ను భరించలేక పోతున్నారట.. టీమ్ లో ప్లేయర్స్ ఎవరో తెలియక వెయిట్ చేస్తోన్న కెప్టన్ లాగా చదలవాడ కూడా వెయిట్ చేస్తున్నారని సమాచారం.. ఇక తెలంగాణ నుంచి చింతల రామచంద్రా రెడ్డి, సాయన్న, సండ్ర వీరయ్య పేర్లు ఖరారు కూడా కావటంతో మిగతా పాలకమండలి సభ్యలెవరుంటారన్న దానిపై గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది..ఇప్పటికే టీటీడి బోర్డు సభ్యులుగా తాము సూచించిన వారికి పదవులు ఇవ్వాలని అటు పీఎంఓ ఆఫీస్ నుంచి, ఇటు పవన్ కళ్యాణ్, ఉమాభారతి, తమిళనాడు సీఎంఓల, నుంచి తాము సూచించిన వాళ్ళను తీసుకోవాలంటూ సిఫార్సులేఖలు సీఎం చంద్రబాబు కు అందాయి. వీళ్ళకు తోడు ఓ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త భార్య కూడా ఈ రేస్ లో ఉందట. మరోవైపు టీడిపి ఎమ్మెల్యేల నుంచి సీఎం చంద్రబాబుకు భారీ సిఫార్సులు వస్తున్నాయని సీఎంఓ అధికారులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే బొండా ఉమ, కోళ్ల లలిత కుమారి, పిల్లి అనంతలక్ష్మి లకు బెర్తులు ఖరారైనట్టు సమాచారం.
ఇప్పటికే 14 మంది పేర్లు ఖరారయ్యాయని, మిగిలిన నలుగురు ఎవ్వరన్న దానిపై సీఎం లెక్కలు సరిచేస్తున్నందు వల్లనే టీటీడి పాలక మండలి నియామకం ఆలస్యమవుతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే అసలు విషయం మాత్రం తిరుపతి కోటాలో ముగ్గురు పోటీలో వుండటంతో ఏం చేయాలో అర్థం కాకు సీఎం ఆలస్యం చేస్తున్నారనే వాదనలు మొదలయ్యాయి.. తిరుపతి బీజేపి నేత భాను ప్రకాష్ రెడ్డి ని పాలక మండలి లో చేర్చాలా వద్దా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఏపి బీజేపి నుంచి ఆకుల సత్యనారాయణ కు స్థానం కల్పించాలని మొదట నిర్ణయించగా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి జోక్యంతో సీన్ మారిందని సమాచారం. ఇక తిరుపతి నుంచే పోటీలో వున్న డాక్టర్ హరిప్రసాద్ ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ రికమెండ్ చేశాడని ఆయనకు కూడా పాలక మండలిలో స్థానం కేటాయించాలనే డిమాండ్ వుందట..ఒక్క తిరుపతి నుంచే ముగ్గురిని పాలక మండలిలో నియమిస్తే అదేమైనా వివాదస్పదంగా మారుతుందేమో నని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అటు పవన్ కళ్యాన్, ఇటు వెంకయ్య నాయుడు ల నుంచి అనుకోని విధంగా సిఫార్సులు రావడం, వెంకయ్య నాయుడు తప్పని సరిగా భాను ప్రకాష్ రెడ్డి కివ్వాల్సిందేనని పట్టు పడుతుండడంతో ఫైనల్ 18 ఎలా వుంటుందన్న దాని పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా, పాలక మండలిని నియమించకపోవటంలో జాప్యం పై అన్ని వైపుల నుంచి సెటైర్లు పేలుతున్నాయి, దీనికి తోడు ఏ క్షణమైనా జీఓ వస్తుందన్న సర్కారు వర్గాల పలుకులు కూడా ఇప్పుడు పెద్ద జోక్ లా మారాయి.. పాలక మండలి సభ్యులు ఎంపిక లోగుట్టు పెరుమాళ్లకు, బాబుకు తప్ప మరెవ్వరికి తెలియదని చెబుతున్నారు.